పదేళ్ల ప్రేమ.. పెళ్లి పీటలెక్కిన శ్రీమణి!

ప్రముఖ లిరిసిస్ట్ శ్రీమణి తన ప్రేయసిని పెళ్లాడి ఓ ఇంటివారయ్యారు. గత పదేళ్లుగా శ్రీమణి ఫరా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో హిందూ సంప్రదాయ పద్దతిలో ఫరాని వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. శ్రీమణి సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. గత పదేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూశామని.. ఎట్టకేలకు తన కల నిజమైందని.. తమ ప్రేమని అర్ధం చేసుకున్న దేవుడికి, తల్లితండ్రులకు ధన్యవాదాలు చెప్పారు.

ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు శ్రీమణికి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ ద్వారా శ్రీమణికి స్పెషల్ విషెస్ అందించారు. ”మీ రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట” అంటూ శ్రీమణి రాసిన పాటల రూపంలో దేవిశ్రీ శుభాకాంక్షలు చెప్పారు. శ్రీమణి కెరీర్ విషయానికొస్తే..

ఆయన సుకుమార్ తెరకెక్కించిన ‘100% లవ్’ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ తరువాత ‘సెగ’ సినిమాలోని ‘వర్షం ముందుగా..’ అనే పాట రాసి బాగా పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ‘ఉప్పెన’, ‘రంగ్ దే’ వంటి సినిమాలకు సాహిత్యం అందించారు.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus