మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (2021 – 2023) ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అక్టోబర్ 10 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజుల ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్, 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లను స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్ వివరించారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని.. ఆ తరువాత ఎన్నికల బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. నామినేషన్ దరఖాస్తుకు రూ.100, ఓటర్ల జాబితా కావాలంటే.. రూ.500 చెల్లించాలని తెలిపారు. ఆఫీస్ బేరర్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.15 వేలు, ఈసీ మెంబర్ రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
నియమ నిబంధనలు:
1. ఒక అభ్యర్థి ఒక పోస్ట్ కోసమే పోటీ చేయాలి.
2. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి.. 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు.
3. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు.
4. సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
5.ఓటు వేయడానికి వచ్చే సభ్యులు తప్పనిసరిగా కోవిడ్ రూల్స్ పాటించాలి
6.పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు.
ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీపడుతున్నారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. మంచు విష్ణు త్వరలోనే తన ప్యానెల్ ను ప్రకటించే అవకాశం ఉంది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!