2 ఏళ్ల క్రితం వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఎక్కువ వ్యూయర్ షిప్ ని నమోదు చేసి టాప్ 10 మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది ఆ సినిమా. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాత. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సెకండ్ పార్ట్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
గౌరీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి .. బన్నీ వాస్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేశారు.టీజర్, ట్రైలర్స్ కూడా అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.మొదటి రోజును మించి రెండో రోజు, రెండో రోజును మించి మూడో రోజు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.38 cr
సీడెడ్
0.42 cr
ఆంధ్ర(టోటల్)
1.60 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
4.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.60 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
5.00 cr
‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే థియేట్రికల్ మొత్తంగా రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 3 రోజుల్లోనే రూ.5 కోట్లు షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.5 కోట్ల లాభాలను అందించింది. ఆల్రెడీ క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.