Maa Oori Polimera 2 OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మా ఊరి పొలిమేర2.. రిలీజ్ డేట్ ఇదే!

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలుగా విడుదలైన మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. అయితే మా ఊరి పొలిమేర2 సినిమా మాత్రం అంచనాలను మించి సక్సెస్ సాధించింది. ఆహా ఓటీటీలో ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. ఆహా అధికారికంగా ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవాళ్లకు ఒకరోజు ముందే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

నవంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా మేకర్స్ కు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్సైన ప్రేక్షకులు ఓటీటీలో మాత్రం ఈ సినిమాను చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విడుదలైన రిలీజైన 5 వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. మా ఊరి పొలిమేర2 మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కీడా కోలా మూవీకి పోటీగా విడుదలై పైచేయి సాధించడం గమనార్హం. (Maa Oori Polimera 2 ) మా ఊరి పొలిమేర3 సినిమా కూడా తెరకెక్కనుంది.

ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. మా ఊరి పొలిమేర3 ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. మా ఊరి పొలిమేర3 కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సత్యం రాజేష్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. వరుస విజయాలతో సత్యం రాజేశ్ పారితోషికం సైతం పెరిగిందని తెలుస్తోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus