Maadhavi Latha: నాగ్ పై ఫైర్ అయిన మాధవీలత!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈ నెల 19వ తేదీన ప్రసారం కానుంది. బాలీవుడ్ నటీనటులు ఈ షోకు గెస్టులుగా హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి గెస్ట్ గా హాజరు కాగా సీజన్ 5 గెస్టుల విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కొంతమంది కంటెస్టెంట్ల విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా మాధవీలత తన ఫేస్ బుక్ ద్వారా హోస్ట్ నాగార్జునపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నాగార్జున హోస్టా లేక ఘోస్టా అంటూ మాధవీలత షాకింగ్ కామెంట్లు చేశారు. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో నాగ్ పై విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగ్ కొంతమందిని సపోర్ట్ చేస్తూ మరి కొందరిని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్లు సైతం ఆరోపిస్తున్నారు. సిరి షణ్ముఖ్ విషయంలో నాగ్ ప్రవర్తన సరిగ్గా లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సిరి షణ్ముఖ్ చేస్తున్న తప్పుడు పనుల్ని నాగార్జున ఎంకరేజ్ చేస్తున్నారని మాధవీలత అన్నారు. హోస్టింగ్ చేయకుండగా నాగార్జున అవమానకరంగా మాట్లాడుతున్నారని మాధవీలత చెప్పుకొచ్చారు. తప్పుల్ని కౌంటర్ చేయలేని నాగార్జునకు కౌంటర్ వేసే హక్కు లేదని ఆమె కామెంట్లు చేశారు. సమాజానికి నాగార్జున ఛానల్ ద్వారా ఏం నేర్పిస్తున్నారని గత వారం కాజల్ ను వెటకారం చేయడం ఏమిటని మాధవీలత కామెంట్లు చేశారు. హోస్ట్ అంటే ఏ విధంగా ఉండాలో జూనియర్ ఎన్టీఆర్ ను చూసి నేర్చుకోవాలని అనాలని ఉందని

అయితే వయస్సుకు గౌరవం ఇచ్చి అనలేకపోతున్నానని నాగార్జునపై మాధవీలత ఫైర్ అయ్యారు. మాధవీలత పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ సీజన్ విన్నర్ సన్నీ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే యాంకర్ రవి మాత్రం శ్రీరామచంద్రకు సపోర్ట్ చేస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus