Maanas, Priyanka: పింకీ అడిగిన ప్రశ్నకి మానస్ ఏం చెప్పాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎలిమినేషన్ అనేది అత్యంత నాటకీయంగా జరిగింది. చివరిలో మానస్ అండ్ కాజల్ ఇద్దరూ ఉండగానే సన్నీలో టెన్షన్ మొదలైంది. ఇక కాజల్ ఎలిమినేట్ అవ్వగానే, తన ఫ్రెండ్స్ సన్నీ మానస్ ఇద్దరూ కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. వెక్కి వెక్కి ఏడుస్తూ హౌస్ నుంచీ కాజల్ కి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకంటే ముందు ఎక్స్ హౌస్ మేట్స్ అడిగిన ప్రశ్నలకి ఇంటి సభ్యులు ఆన్సర్స్ ఇచ్చారు.

వీడియో రూపంలో ఎక్స్ హౌస్ మేట్స్ ఈ ప్రశ్నలని అడిగారు. ఇందులో భాగంగా ప్రియంక మానస్ ని ఒక ప్రశ్న అడిగింది. ఇప్పటివరకూ హౌస్ లో నన్ను నువ్వు భరించావా ? నటించావా అంటూ మానస్ ని నిలదీసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే, కొన్ని ఎపిసోడ్స్ చూశాకా నాకు అలా అనిపించింది అంటూ అడిగింది. నేను ప్రియాంకని భరించాను అని, నటించలేదని చెప్పాడు మానస్. ఎదైతే జెన్యూన్ ఎమోషన్స్ ఉన్నాయో అవే చూపించాను. నాకు కోపం ఉంటే అదే చూపించాను.

కొన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను, కొన్ని తను అర్ధం చేసుకుంది. కొన్ని అర్ధం చేస్కోలేదు. భరించడం అని ఎందుకు అన్నాను అంటే, ఏదైనా కూడా పింకీకి స్ట్రయిట్ గా చెప్తే అర్ధం కాదని, అర్ధం చేస్కోవాలి అనుకుందే తను అర్ధం చేసుకుంటుంది. తనకి ఒక సొంత పరిధి ఉంటుంది. అక్కడే వరకే తను ఎదున్నా సరే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయదు. సింపుల్ గా అయితే, నేను నటించలేదు అంటూ మానస్ క్లియర్ గా చెప్పాడు.

ఇక ఎక్స్ హౌస్ మేట్స్ అందర్నీ ఒక్కొక్క ప్రశ్న అడిగారు. ఇక్కడ శ్రీరామ్ చంద్రని నటరాజ్ మాస్టర్, సిరి-షణ్ముక్ ఇద్దరినీ జెస్సీ, కాజల్ ని ప్రియా, సన్నీని అనీమాస్టర్ ప్రశ్నలు అడిగారు. ఫినాలే వీక్ కాబట్టి ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ హౌస్ లోకి వచ్చి సందడి చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈసీజన్ లో ఇది చేస్తారా లేదా అనేది ఆసక్తికరం.

[yop_poll id=”7″]

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus