Bigg Boss Telugu 5: ప్రియాంక విషయంలో అందుకే మానస్ డీప్ గా హర్ట్ అయ్యాడా..?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ తర్వాత ప్రియాంకకి మానస్ కి పెద్ద ఆర్గ్యూమెంటే అయ్యింది. ప్రియాంకకి క్లాస్ పీకుతూ, దూరం పెడుతూ వచ్చాడు మానస్. అసలు చెప్పేటపుడు వినిపించుకోవట్లేదంటూ మాట్లాడాడు. అంతేకాదు, తను చెప్పాలనుకున్నది చెప్పేశాడని నేను మాట్లాడుతుంటే అలాగే మధ్యలో వచ్చేస్తావా అంటూ ప్రియాంక మానస్ పై ఫైర్ అయ్యింది. ఇక్కడ్నుంచీ గొడవ స్టార్ట్ అయ్యి, ఎక్కడెక్కడికో వెళ్లింది. ఇక్కడ అసలు వీళ్లిద్దరికీ ఎందుకు చెడింది అనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్ధరి గురించి సోషల్ మీడియాలో రకరకాలా కథనాలు వస్తున్నాయి. కానీ, అసలు గొడవేంటి అనేది చూసినట్లయితే,

ప్రియాంక కమ్యూనిటీ విషయంలో కాజల్ ని నామినేట్ చేసింది. నేను అంటే అన్నాను కానీ, ఆ పాయింట్ ని నువ్వు షణ్ముక్ దగ్గర తీసుకుని రావడం నాకు నచ్చలేదంటూ చెప్పింది. దీనికి మానస్ ప్రియాంకకి కౌన్సిలింగ్ చేశాడు. నీకు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్టింగ్ గా మాట్లాడిందా లేదా అదే చూడాలి కానీ, పాయింట్ ఎవరో చెప్పారని మాట్లాడకూడదు, ఇప్పటికైనా నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో అంటూ చెప్పాడు. అప్పట్నుంచీ ప్రియాంకని ఎవైడ్ చేస్తూ వచ్చాడు. దీంతో ఫ్రస్టేట్ అయిపోయింది ప్రియాంక. అంతేకాదు, మానస్ కాజల్ తో ఎక్కువసేపు టైమ్ స్పెండ్ చేయడం కూడా ప్రియాంకకి నచ్చడం లేదు.

కాజల్ ఎలిమినేషన్ నుంచీ తప్పించుకున్న తర్వాత మానస్ ని హగ్ చేస్కుంటూ భోరున ఏడ్చింది. తన ఎమోషన్ ని తీర్చుకుంది. అక్కడే ఉన్న ప్రియాంకకి ఇది అస్సలు మింగుడు పడలేదు. దీంతో కాజల్ ని ఎవైడ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు నామినేషన్స్ లో ఎలాంటి రీజన్స్ లేనపుడు నేనేం చెప్పలేను అంటూ కాజల్ ని నామినేట్ చేసింది. దీంతో మానస్ క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. ఇక ఇద్దరూ చాలాసేపు ఈ విషయంపై ఆర్గ్యూమెంట్ చేసుకున్నారు. మానస్ తో మాట్లాడాలి అంటూ పింకీ వెంటబడతుంటే మధ్యలో కాజల్ స్పేస్ ఇవ్వు అంటూ మాట్లాడింది.

ఇక్కడే నీ ఫ్రెండ్ మధు వచ్చి మానస్ కి సారీ ఎందుకు చెప్పిందో తెలుసు కదా అంటూ మాట్లాడేసరికి ప్రియాంకకి ఇంకా కోపం వచ్చింది. కాజల్ ని ఎన్నో మాటలు అనేసింది. దీంతో కాజల్ చాలాసేపు ఎమోషనల్ అయ్యింది. పింకీ రాత్రివరకూ అన్నం తినకుండా బాధపడుతుంటే మానస్ వచ్చి ఓదార్చి, హగ్ ఇచ్చి అన్నం తినిపించాడు. ఇక మార్నింగ్ లేవగానే కాజల్ తో మళ్లీ సఖ్యత కుదుర్చుకుంది ప్రియాంక. కాజల్ ని మళ్లీ ఫ్రెండ్ ని చేసుకుని హగ్ ఇచ్చింది. మొత్తానికి అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus