మానస్ హౌస్ మేట్స్ తో పర్సనల్ గా మాట్లాడింది ఇదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో గబ్బర్ సింగ్ సాంగ్ తో స్టైల్ గా ఎంట్రీ ఇచ్చాడు మానస్. లాస్ట్ సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన మాస్టర్ , విన్నర్ గా నిలిచిన సన్నీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ గేమ్ ని మరో లెవల్లోకి తీస్కుని వెళ్లారు. ఇక రావడమే హౌస్ మేట్స్ ని తనదైన స్టైల్లో పలకరించాడు. ఒక్కొక్కరి గేమ్ గురించి చెప్తూ వచ్చాడు. ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు ? ఎవరి స్టైల్ ఏంటి అనేది కూడా చెప్పి, తన ఫేవరెట్ టాస్క్ ని ఆడించాడు. ఇక్కడే మిత్రా శర్మా, ఇంకా అషూరెడ్డి ఇద్దరూ కూడా మానస్ తో చాలాసేపు పర్సనల్ గా మాట్లాడారు. ఇద్దరికీ మంచి బూస్టప్ పాయింట్స్ చెప్పాడు మానస్. ఎవరు ఏం అనుకున్నా కూడా నీలాగే ఉండమని మిత్రాకి సలహా ఇచ్చాడు. టాప్ 9లోకి వచ్చారంటే ఇది మాములు విషయం కాదని, 10వారాల పాటు ఆడియన్స్ సేవ్ చేస్తున్నారంటే, మీ ఆట నచ్చే కదా అంటూ మానస్ చెప్పుకొచ్చాడు.

 

అలాగే, అషూరెడ్డికి కూడా తన గేమ్ ఎలా ఉందో చెప్తూ హింట్స్ ఇచ్చాడు మానస్. ఇక్కడే సన్నీ గేమ్ స్ట్రాటజీ, తన గేమ్ స్ట్రాటజీ ఎలా ఉందో చెప్పాడు. రింగ్ గేమ్ ఆడిన తర్వాత, అరియానా తెలివికి బాబాభాస్కర్ ఫిదా అయిపోయారు. అన్ని రౌండ్స్ లోనూ నటరాజ్ మాస్టర్ గెలుస్తుంటే, అరియానా ప్లాన్ వేసింది. బిందుమాధవితో మాట్లాడుతూ, నువ్వు మాస్టర్ ని ఆపేసేయ్, నేను కర్చీఫ్ తీస్కుని మాస్టర్ ని ఎలిమినేట్ చేస్తాను అంటూ చెప్పింది. ఈ పాయింట్ , ఈ స్ట్రాటజీ చాలా బాగుందని బాబా మాస్టర్ చెప్పారు. ఇక్కడే మానస్ కూడా సన్నీ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడని, నటరాజ్ మాస్టర్ ప్రతిసారి బజర్ కొట్టేస్తుంటే, సన్నీ కావాలనే మాస్టర్ పైన పడిపోయాడని, నాకు భయమేసింది మాస్టర్ అంటూ కవర్ చేశాడని సీక్రెట్ ని చెప్పాడు.

 

ఇక మానస్ ఈ స్ట్రాటజీల వల్లే గేమ్ లో గెలుస్తామని, టాస్క్ ఆడేటపుడు ఖచ్చితంగా పోరాడాలి అని, అంతేకాదు, ఎమోషన్స్ , ఫీలింగ్స్ ని పెట్టుకోకూడదని క్లియర్ గా చెప్పాడు. సన్నీ, నేను ఇద్దరం ఇలాగే గేమ్ ఆడేవాళ్లం అంటూ తమ సీజన్ ని మరోసారి గుర్తుచేశాడు. అంతేకాదు, టాస్క్ లో వేరేవాళ్లు ఎవరైనా ముందుకు వెళ్తున్నా కూడా స్ట్రాటజీలని వర్కౌట్ చేసేవాళ్లమంటూ చెప్పుకొచ్చాడు మానస్. ఇక హౌస్ మేట్స్ తో పర్సనల్ గా మాట్లాడుతూ వాళ్లకి మంచి బూస్టప్ ఇచ్చాడు. అదీ విషయం.

Share.