‘టిల్లు స్క్వేర్’ తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’ తో రూ.100 కోట్ల సినిమాలో భాగం అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య… కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మూవీ ‘జాక్’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. స్పై జోనర్లో వచ్చిన ఈ సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ మిస్ అవ్వడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు.
Jack Collections
దీంతో బాక్సాఫీస్ వద్ద టార్గెట్ రీచ్ అవ్వలేక చతికిలపడింది. నిర్మాత సునీల్ నారంగ్ కూడా ఓ ఇంటర్యూలో ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చినట్టు తెలిపి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి ‘జాక్’ (Jack) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘జాక్’ (Jack) సినిమాకు రూ.14.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.4.36 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.02 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.11.14 కోట్ల దూరంలో ఆగిపోయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ చిత్రం.