Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 27, 2025 / 12:15 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విష్ణు మంచు (Hero)
  • ప్రీతి ముకుందన్ (Heroine)
  • అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ (Cast)
  • ముఖేష్ కుమార్ సింగ్ (Director)
  • మోహన్ బాబు (Producer)
  • స్టీఫెన్ దేవస్సీ (Music)
  • షెల్డన్ చావ్ (Cinematography)
  • ఆంథోనీ (Editor)
  • Release Date : జూన్ 27, 2025
  • అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ (Banner)

మంచు విష్ణు (Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం “కన్నప్ప” (Kannappa). ఈ సినిమాకి అతడే కథ రాసుకోవడం విశేషం. ప్రముఖ బాలీవుడ్ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్  నేతృత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లు కీలకపాత్రలు పోషించగా.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ చిత్రం మీద మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ తో సినిమా మీద ఉన్న నెగిటివిటీ పోయి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి సినిమా ఆ టాక్ ను ఏమేరకు వినియోగించుకోగలిగింది? ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది? అనేది చూద్దాం..!!

Kannappa Review

Kannappa Movie Review and Rating2

కథ: పరమ నాస్తికుడైన తిన్నడు (మంచు విష్ణు) (Manchu Vishnu) , పరమ భక్తుడిగా ఎలా మారాడు? అందుకు ప్రేరేపించిన అంశాలేమిటి? ఎదురైన సంఘటనలు ఏమిటి? శివుని ఆజ్ఞతో, లీలతో తిన్నడు భక్తిపారవశ్యంతో కన్నప్పగా (Kannappa) ఎలా మారాడు? అనేది “కన్నప్ప” కథాంశం.

Kannappa Movie Review and Rating

నటీనటుల పనితీరు: నటుడిగా మంచు విష్ణు పరిణితి చెందిన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ క్యారెక్టర్లో అతడ్ని చూసేందుకు ప్రేక్షకుల్ని సిద్ధపరచడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా.. ఎప్పుడైతే తిన్నడు పాత్రలో భక్తి భావం కలుగుతుందో.. అప్పటినుండి మంచు విష్ణు నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా చివరి 15 నిమిషాల్లో తనను తాను శివుడికి అర్పించుకున్న మహోన్నతుడిగా విష్ణు నటనకు ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు.

అక్షయ్ కుమార్ కళ్లల్లోని ప్రశాంతత శివుడిగా అతడిలో దైవత్వం కనిపించేందుకు దోహదపడింది. అక్షయ్ పక్కన కాజల్ అగర్వాల్ కూడా పార్వతి పాత్రలో ఒదిగిపోయింది.

మోహన్ లాల్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి మంచి వెల్యూ యాడ్ చేసింది.

ఇక ప్రభాస్ ఎంట్రీ తోనే సినిమా వేగం పుంజుకుంది. ప్రభాస్ బేస్ వాయిస్ డైలాగ్స్ కి మరింత బరువు యాడ్ చేయడమే కాక.. ఆ పాత్ర తాలూకు దైవత్వాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేశాయి. దాదాపుగా 20 నిమిషాలపాటు ప్రభాస్ కనిపించడం.. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ తో అతడికి ఉండే కాంబినేషన్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. కళ్లల్లో దైవత్వం, మాటల్లో వ్యంగ్యం, బాడీ లాంగ్వేజ్ లో ధీరత్వం ప్రభాస్ ప్రెజన్స్ ను సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిపాయి.

ప్రీతి ముకుందన్ అందంగా కనిపిస్తూనే.. మంచి నటనతో ఆకట్టుకుంది. శరత్ కుమార్, బ్రహ్మాజీ, రఘుబాబు, అర్పిత్ రాంకా, బ్రహ్మానంద, సప్తగిరిలు తమ తమ పరిధి మేరకు మంచి నటన కనబరిచారు.

Kannappa Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా సినిమాలో చాలా లోపాలున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సీజీ వంటి విషయాల్లో వేలెత్తి చూపేందుకు బోలెడు ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ సరైన స్థాయిలో టైమ్ లైన్ కు తగ్గట్లుగా పరిసరాలను, కాస్ట్యూమ్స్ ను సెట్ చేయలేకపోయాయి. చాలాచోట్ల తప్పులు దొర్లాయి. ఇక సీజీ వర్క్ కొన్ని చోట్ల మరీ పేలవంగా ఉంది.

అయితే.. ఈ లోపాలన్నిటినీ కథలోని ఎమోషన్ కవర్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక్కసారి ప్రభాస్ ఎంటరయ్యాక టెక్నికల్ ఇష్యూస్ ఏమీ కనిపించలేదు. ఇక క్లైమాక్స్ లో మంచు విష్ణు పెర్ఫార్మెన్స్ మిగతా లోపాలను కవర్ చేసింది.

స్టీఫెన్ స్వరపరిచిన బాణీలు ఓ మోస్తరుగా ఉన్నా.. నేపథ్య సంగీతంతో మాత్రం డివోషనల్ ఫీల్ తీసుకురాలేకపోయాడు. మరీ ముఖ్యంగా.. వార్ ఎపిసోడ్ లో బీజీఎం సన్నివేశాన్ని, ఎమోషన్ ను ఏమాత్రం ఎలివేట్ చేయలేక చతికిలపడింది.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. న్యూజిలాండ్ అందాలను సహజంగా చూపించారు. అలాగే.. వాయు లింగం ఎపిసోడ్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది.

ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉన్నప్పటికీ.. వార్ ఎపిసోడ్స్ ను పేలవమైన ఎఫెక్ట్స్ కారణంగా చాలా ల్యాగ్ ఫీల్ కలుగుతుంది. కలర్ గ్రేడింగ్ లో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది.

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఎమోషన్స్ వరకు బాగానే హ్యాండిల్ చేశాడు కానీ.. యాక్షన్ ఎపిసోడ్స్ & వార్ ఎపిసోడ్స్ ను మాత్రం సరిగా మ్యానేజ్ చేయలేకపోయారు. విలేజ్ ఫైట్ లో మంచు విష్ణు స్లో మోషన్ లో కొట్టడం మరీ సీరియల్ ను తలపిస్తుంది. అయితే.. భక్తిభావాన్ని ఎలివేట్ చేయడంలో మాత్రం తన సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నాడు ముఖేష్. వాయిలింగాన్ని విష్ణు హత్తుకున్నప్పుడు శివుడిని ఆలింగనం చేసుకున్నట్లుగా చూపించే ఇంటర్ కట్ ఎపిసోడ్ బాగుంది. అలాగే క్లైమాక్స్ ను కూడా నీట్ గా వర్కవుట్ చేశాడు.

Kannappa Movie Review and Rating

విశ్లేషణ: “కన్నప్ప” కథ ఒక చరిత్ర. ఏమీ ఆశించకుండా దేవుడ్ని పూజించే భక్తులకు ఎల్లప్పుడూ ఆయన అండగా నిలుస్తాడు అనే ధర్మాన్ని బోధించిన గొప్ప కథ అది. ఆ కథను, ధర్మాన్ని నేటి తరానికి చెప్పడం కోసం “కన్నప్ప” చిత్రంతో మంచు విష్ణు చేసిన ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి. అయితే.. ఫస్టాఫ్ లో సంబంధం లేకుండా వచ్చే సన్నివేశాలు, పేలవమైన గ్రాఫిక్స్ కాస్త ఇబ్బందిపెడతాయి. సెకండాఫ్ మంచి ఊరటనిస్తుంది. ఇక చివరి 40 నిమిషాలు మాత్రం కచ్చితంగా అలరిస్తుంది. ఏ ఒక్కర్నీ, ఏ వర్గాన్ని, ఏ సంస్కృతిని కించపరచకుండా.. చాలా జాగ్రత్తగా తెరకెక్కించిన “కన్నప్ప” యువతరానికి భక్తిభావం పరిచయం చేస్తుంది.

Kannappa Movie Review and Rating

ఫోకస్ పాయింట్: నవతరానికి భక్తి భావాన్ని పరిచయం చేసిన “కన్నప్ప”!

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #Madhoo
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Mohanlal

Reviews

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

Prabhas: ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

Prabhas: ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

trending news

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

12 hours ago
Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

14 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

14 hours ago
Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

14 hours ago
Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

14 hours ago

latest news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

15 hours ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

16 hours ago
Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

17 hours ago
Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

17 hours ago
Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version