దిల్ రాజు కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆయన ఎంత క్లారిటీగా ఉంటారో.. మీడియా ముందు లేదా ఈవెంట్లలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన అంతే క్లారిటీగా ఉంటారు. ఇదిలా ఉండగా.. ‘తమ్ముడు’ (Thummudu) ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు (Dil Raju), నితిన్ (Nithiin) సరదాగా ఓ చిట్ చాట్ సెషన్ పెట్టుకున్నారు. ఇందులో నితిన్ గురించి దిల్ రాజు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
”దిల్’ కి ‘తమ్ముడు’ కి.. ఈ మధ్యలో మీరు నాలో చూసిన మార్పులు ఏంటి? నాలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి చెప్పండి’ అంటూ దిల్ రాజుని ప్రశ్నించాడు నితిన్ (Nithiin). అందుకు దిల్ రాజు మాట్లాడుతూ.. ” నువ్వు యాక్టర్ గా 23 ఏళ్ళు జర్నీ చేశావ్. నాకంటే నువ్వు ఏడాది సీనియర్..వి. నేను 2003 లో నిర్మాతగా మారాను. నువ్వు 2002 లోనే హీరో అయ్యావ్. సో నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొన్ని విషయాల్లో నేను ఎలా హ్యాండిల్ చేయగలనో నువ్వు అలా హ్యాండిల్ చేయగలవు.
అన్నీ మ్యానేజ్ చేయగలవు. అది నీ ప్లస్ పాయింట్. నువ్వు కోల్పోయింది అది అని నా ఫీలింగ్. ఇక మైనస్ ఏంటంటే… దిల్ రాజుగా నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ లోకి వచ్చాను. నేను ‘దిల్’ చేస్తున్నప్పుడు నిన్ను(నితిన్ ను) ‘ఆర్య’ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ని ఫ్యూచర్ స్టార్స్ గా ఊహించుకున్నాను. అల్లు అర్జున్ అచీవ్ చేశాడు. నువ్వు అచీవ్ చేయలేకపోయావ్ ” అంటూ నితిన్ మొహంపైనే చెప్పుకొచ్చాడు దిల్ రాజు.
అందుకు నితిన్ ‘ ‘తమ్ముడు’ తో ఏమైనా పూర్వ వైభవం వస్తుందంటారా?’ అంటూ మళ్ళీ దిల్ రాజుని అడిగాడు. ‘ ‘తమ్ముడు’ తో నువ్వు సక్సెస్ ట్రాక్లోకి వస్తావ్. కానీ అది సరిపోదు. ‘ఎల్లమ్మ’ తో కొట్టాలి’ అంటూ నితిన్ కి బదులిచ్చాడు దిల్ రాజు.