‘దేవర'(మొదటి భాగం) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నుండి ‘వార్ 2’ రానుంది. ‘దేవర 2’ కూడా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళింది. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇది కూడా పీరియాడిక్ మూవీనే. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ షూటింగ్ కూడా నిర్వహించారు. రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. కథ ప్రకారం మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉంటుందట.
అలాగే స్పెషల్ సాంగ్ కోసం కూడా మరో హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘హోంబలే ఫిలిమ్స్’ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు. తొలిసారి తెలుగు నిర్మాణ సంస్థ.. అదే బడా నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ లో ‘డ్రాగన్’ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉండగా.. ‘డ్రాగన్’ స్క్రిప్ట్ లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఇప్పుడు టాక్ నడుస్తుంది.
అయితే కథ మొత్తం మారిపోతుందా? అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. కానీ అది కాదు. కథ అలానే ఉంటుంది.. కానీ హీరో రోల్ కి ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించాడట. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో ఇలాంటివి అతను ఎంకరేజ్ చేయడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం తలొంచినట్టు తెలుస్తుంది. ‘డ్రాగన్’ కనుక ‘హోంబలే’ సంస్థలో చేస్తుంటే కనుక.. ప్రశాంత్ నీల్ తగ్గేవాడు కాదేమో.
కానీ ఇప్పుడు ‘మైత్రి..’ హ్యాండోవర్లో ఉండటం వల్ల ఎన్టీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏదైతేనేం సినిమా బాగా వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయినా, ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కి అయినా కావాల్సిందేముంటుంది.