మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా దిల్ రాజుకి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. శంకర్ వంటి స్టార్ ను నమ్మి రూ.500 కోట్లు మంచి నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టేశారు. దర్శకుడు శంకర్ నిర్మాతతో బడ్జెట్ పెట్టించడం పై పెట్టిన శ్రద్ధ సినిమా కంటెంట్ పై పెట్టలేదు అని విమర్శకులు దారుణంగా పెదవి విరిచారు.
ఇక ఈ సినిమా ఫలితం గురించి దిల్ రాజుకి ప్రతి సినిమా ఈవెంట్లో ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా నిర్వహించిన ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో రాంచరణ్ (Ram Charan) తో నెక్స్ట్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించి దిల్ రాజు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ… “ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఓ బ్లాక్ బస్టర్ అందుకున్నాము. త్వరలోనే ‘తమ్ముడు’ తో మరో హిట్ అందుకోబోతున్నాం. కాకపోతే ఈ 2025 లో మాకు ఒక్కటే లోటు.
అదే ‘గేమ్ ఛేంజర్’. రాంచరణ్ (Ram Charan) తో సూపర్ హిట్ సినిమా తీయలేకపోయామే అనే చిన్న గిల్ట్ మాకు ఉంది. తొందరలోనే రాంచరణ్ (Ram Charan) తో కూడా ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.ఆ ప్రాజెక్టును కూడా తొందరలోనే ప్రకటిస్తాం” అంటూ ప్రకటించేశారు దిల్ రాజు. దీంతో రాంచరణ్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఏ స్టార్ డైరెక్టర్ కథతో దిల్ రాజు.. రాంచరణ్ తో సినిమా చేస్తారా? అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో మొదలైపోయాయి.