Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

  • June 27, 2025 / 11:25 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

సినిమా అంటేనే మన జీవితాల్లోని రకరకాల రంగుల్ని తీసుకుని తెరపై ఆవిష్కరించడం. పేదరికం, కష్టాలు వంటివి కూడా ఇందులో భాగమే. ఆకలి, అవసరం అనేది అందరికీ ప్రధాన శత్రువులు. మనం నిజ జీవితంలో చూసే బిక్షం అడిగే వాళ్ళకి కూడా ఇంతే. కానీ వాళ్ళని బలహీనులుగా అలాగే చులకనగా చూడటం అనేది ఆనవాయితీగా వస్తోంది. కొంచెం కష్టంగా, కఠినంగా అనిపించినా ఈ మాట నిజం. అయితే సినిమాల్లో ఇలాంటి పాత్రలను కూడా చాలా పవర్ఫుల్ గా చూపిస్తున్నారు మన ఫిలిం మేకర్స్. తాజాగా ‘కుబేర’ (Kuberaa) వచ్చింది.ఇందులో కూడా బిక్షం అడిగే వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు అని.. వాస్తవానికి ‘అందరూ అడుక్కునేవాళ్లే.. కొంతమంది ఫీజ్ కోసం తల్లిదండ్రులను అడుక్కునే వాళ్ళు, ప్రమోషన్ కోసం బాస్..లను అడుక్కునే వాళ్ళు.. ఇలా ఏదొక రకంగా అందరూ అడుక్కుంటూనే ఉంటారు’ అనే గొప్ప విషయాన్ని రష్మిక (Rashmika Mandanna) పాత్రతో తన స్టైల్లో చాలా సింపుల్ గా చెప్పించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar kammula). ‘కుబేర’ మాత్రమే కాదు గతంలో కొన్ని సినిమాల్లో కూడా బిచ్చగాళ్ళ పెయిన్ చూపిస్తూ పవర్ఫుల్ గా కూడా చూపించారు. ఆ సినిమాలు ఏంటో? బిచ్చగాళ్ళుగా కనిపించిన నటీనటులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Movies

focus2 (1)

1)కుబేర (Kuberaa):

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!
  • 2 Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!
  • 3 Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

focus9

శేఖర్ కమ్ముల తీసిన ‘కుబేర’ లో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించాడు. నిజంగా ఇది మెయిన్‌ స్ట్రీమ్ సినిమాల్లో చాలా అరుదైన, డేరింగ్ స్టెప్. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ క్యారెక్టర్లలో ఇదొకటని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఓ బిచ్చగాడిని కథానాయకుడిగా.. పవర్ఫుల్ గా చూపించి, మూస పద్ధతులకు చెక్ పెట్టి, ఫ్రెష్‌గా ఓ కథ చెప్పారు. ఇది హిట్ టాక్ తెచ్చుకుంది.

2)చార్లీ చాప్లిన్ ‘ది ట్రాంప్’ (Charlie Chaplin ‘The Tramp’):

focus6

ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో చార్లీ చాప్లిన్ ‘ది ట్రాంప్’ ఒకటి. 1910-1930ల మధ్య కాలంలో వచ్చిన ఈ పాత్ర ఓ సంచలనం. ఓ పేదవాడు కఠినమైన ప్రపంచంలో బతకడానికి పడే పాట్లు, ఉద్యోగం లేని వేదన.. వీటన్నింటినీ చూపిస్తూనే, నవ్వులు పూయించి, మనసుల్ని హత్తుకున్నాడు చాప్లిన్.

3) స్లమ్‌డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire):

focus5

ఈ సినిమా ఇండియన్ మురికివాడల్లోని బాల బిచ్చగాళ్ల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కొంతమంది విమర్శకులు ఇది ఇండియాను మూస పద్ధతిలో చూపిస్తోందని అన్నా, ప్రపంచవ్యాప్తంగా మాత్రం సినిమా పెద్ద ప్రభావమే చూపింది. ఇండియన్ సినిమాకి ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది.

4)టైమ్ అవుట్ ఆఫ్ మైండ్ (Time Out of Mind):

focus4

ఈ సినిమాలో రిచర్డ్ గేర్, న్యూయార్క్ వీధుల్లో బతికే మానసిక అనారోగ్యంతో బాధపడే ఓ నిరాశ్రయుడిగా కనిపిస్తాడు. తన పాత్రలో అతను ఒదిగిపోయాడు. ఇంకో రకంగా జీవించాడు అనే చెప్పాలి. ఆయన నటన చాలా సహజంగా, మనసులను కదిలించేలా ఉంది.

5) బిచ్చగాడు(పిచ్చైకారన్) (Pichaikkaran):

focus10

విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ తమిళ సినిమా తెలుగులో ‘బిచ్చగాడు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గట్టి ప్రభావమే చూపింది. కోటీశ్వరుడైన కొడుకు, అనారోగ్యం పాలైన తల్లిని కాపాడుకోవడానికి బిచ్చగాడిగా మారిన కథ ఇది. ఈ ఎమోషనల్ పాయింట్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. అలాగే చివర్లో బిచ్చగాళ్ళని తక్కువ చేసి చూడొద్దు అంటూ ఓ మెసేజ్ కూడా పాస్ చేశారు.

6)ట్రాఫిక్ సిగ్నల్ (Traffic Signal):

focus7

ఈ సినిమా ముంబై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బతికే బిచ్చగాళ్లు, ఇతర వీధి వ్యాపారుల నిజ జీవితంలో ఉండే కష్టాలను అందంగా చూపించారు.

7)నాన్ కడవుల్ (Naan Kadavul):

2009 లో తమిళంలో వచ్చిన సినిమా ఇది. సినిమా బలవంతంగా బిచ్చమెత్తిస్తున్న చీకటి ప్రపంచాన్ని, అందులో చిక్కుకున్న నిస్సహాయుల జీవితాలను చూపించింది.

8)బ్లడీ బెగ్గర్ (Bloody Beggar):

focus8

ఇది కూడా తమిళంలో వచ్చిన సినిమా. ఇందులో కవిన్, ఓ బిచ్చగాడి జీవితాన్ని మరో కొత్త కోణంలో, విభిన్నంగా ఆవిష్కరించాడు. ఇందులో కూడా బిచ్చగాడి పాత్రని పవర్ఫుల్ గా చూపించారు.

9) బిచ్చగాడు 2 (Pichaikkaran 2) :

focus3

సత్య అనే ఓ బిచ్చగాడిని తమ స్వార్థం కోసం వాడుకోవాలనే కార్పొరేట్ అధిపతులకు… అతను ఎలా ఎదురు తిరిగాడు. తన సోదరి కోసం చేసిన పోరాటాన్ని ఇందులో చూపించారు. ఇందులో బిచ్చగాడి పాత్రని పవర్ఫుల్ గా చూపించి హిట్ కొట్టారు.

వీటితో పాటు ఇంకా చాలా సినిమాల్లో స్టార్ హీరోలు సైతం బిచ్చగాళ్ళుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ‘శ్రీ మంజునాథ’ సినిమాలో చిరంజీవి (Chiranjeevi), ‘కృష్ణార్జున’ సినిమాలో నాగార్జున మొదలగు హీరోలు కూడా బిచ్చగాళ్ళుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bloody Beggar
  • #Chiranjeevi
  • #Kuberaa
  • #Pichaikkaran
  • #Rashmika Mandanna

Also Read

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

related news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Raja Ravindra: చిరంజీవి ఆ సినిమా తీయడం నాకు నచ్చలేదు.. నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తెగ తిట్టారు: రాజా రవీంద్ర

Raja Ravindra: చిరంజీవి ఆ సినిమా తీయడం నాకు నచ్చలేదు.. నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తెగ తిట్టారు: రాజా రవీంద్ర

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

trending news

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

1 hour ago
Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

1 hour ago
The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

4 hours ago
The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

4 hours ago

latest news

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

2 hours ago
Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

2 hours ago
కె.జి.ఎఫ్ నటుడు మృతి!

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

7 hours ago
Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

22 hours ago
Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్..  టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్.. టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version