ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి.. చివరికి కనిపించే నెంబర్ ఇంకొకటి. పాన్ ఇండియా మార్కెట్ వల్ల డిజిటల్ మార్కెట్ పెరగడం, ఓటీటీ రూపంలో డబ్బులు బాగా వస్తుండడంతో బడ్జెట్ పెరిగినా పర్వాలేదని అనుకుంటున్నారు. దాంతో అనుకున్న బడ్జెట్ కంటే మేకింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తాజాగా నితిన్ సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’.
ఈ సినిమాను నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ తెరకెక్కిస్తోంది. సొంత బ్యానర్ లో సినిమా అంటే హీరోలు బడ్జెట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. వీలైనంత తక్కువలోనే సినిమా తీయాలనుకుంటున్నారు. కానీ నితిన్ సినిమా విషయంలో అలా జరగడం లేదు. ముందు అనుకున్నదానికంటే ముప్పై శాతం ఖర్చు పెరిగిపోయింది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. దర్శకుడికి ఇదే మొదటి సినిమా. మేకింగ్ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి.
బెటర్ మెంట్ కోసం రీషూట్లు చేయడం వలన కూడా బడ్జెట్ అదుపు తప్పిందని తెలుస్తోంది. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాపై నితిన్ గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే సినిమా బడ్జెట్ పెరుగుతున్నా.. పట్టించుకోవడం లేదని సమాచారం. బడ్జెట్ ఎంతయినా.. సినిమా అవుట్ పుట్ బాగా వస్తే చాలని అనుకుంటున్నాడు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!