Nithiin: యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్!

ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో నితిన్ ఒక పవర్ ఫుల్ కలెక్టర్ పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు.మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండటంతో సెన్సార్ సభ్యులు ఈ సినిమాని వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసాయి. నితిన్ ఈ సినిమా ద్వారా మరొక హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నారని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో దుర్మార్గులైన రాజకీయ నాయకులు భరతం పట్టే కలెక్టర్ గా నితిన్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో నటి అంజలి నటించడం విశేషం.

ఎక్కడ చూసిన ప్రస్తుతం ఇదే పాట వినిపించడమే కాకుండా సోషల్ మీడియాలో మిలియన్ సంఖ్యలో వ్యూస్ దక్కించుకొని మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇందులో కృతి శెట్టి స్వాతి అనే ఒక సాధారణ అమ్మాయి పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus