డైరెక్టర్ కు మద్దతుగా నిలబడిన హీరో నితిన్.. ఏం జరిగిందంటే?

జయం సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నితిన్ సినిమా సూపర్ హిట్ అవటంతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దిల్ సై వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వగా కొన్ని సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. ఎన్నో ప్లాప్ సినిమాల తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ సినిమాలతో నితిన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత నితిన్ హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత వచ్చిన మాస్ట్రో సినిమా నిరాశపరిచింది.

ప్రస్తుతం నితిన్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ మొదటిసారిగా మాస్ లుక్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో నితిన్ ఒక పొలిటికల్ లీడర్ గా ప్రేక్షకులకు కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ తో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాలకు సంబంధించిన కులాలను కించపరుస్తూ..బూతులు తిడుతున్నట్టుగా పోస్టు చేశారు. అయితే ఈ విషయం గురించి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి స్పందిస్తూ తన పేరుతో ఉన్న ఈ పోస్ట్ లు నకిలివని ఆయన తెలియచేశారు. అంతేకాకుండా నేను ఇప్పటివరకూ ఎవరినీ కించపరుస్తూ మాట్లాడలేదని, నా అకౌంట్ లో ఒక్క పోస్టు కూడా నేను డిలీట్ చేయలేదు అంటూ వివరణ ఇచ్చాడు. అయితే తన డైరక్టర్ గురించి వస్తున్న తప్పుడు వార్తలపై నితిన్ ఇటీవల స్పందించాడు.

సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. నితిన్ ట్వీట్ చేస్తూ.. డైరెక్టర్ పేరుతో ఉన్న పాత పోస్ట్ లకు సంబధించిన స్క్రీన్ షాట్ ను జోడించి.. ఫేక్ అకౌంట్ ద్వారా ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ ఇప్పుడు అనవసరమైన రచ్చ సృష్టించింది.. దురదృష్టవశాత్తు ఇది ఇతరుల మనోభావాలను కూడా దెబ్బతీసింది. ఈ పోస్ట్ ల వల్ల చాలా మంది బాధపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను అంటూ తన డైరక్టర్ ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus