Mad Square Collections: ఆల్రెడీ సూపర్ హిట్.. 2వ వారం కూడా బాగానే కలెక్ట్ చేసింది..!

నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin)..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ కి(MAD)సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) . ఉగాది కానుకగా మార్చి 28న రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. 3 సినిమాల మధ్య భారీ పోటీలో రిలీజ్ అయినా ‘మ్యాడ్ స్క్వేర్’ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ తర్వాత కూడా సినిమా నిలకడగా రాణించింది. ఎన్టీఆర్ (Jr NTR)  సక్సెస్ మీట్ కి రావడం కూడా కొంత హెల్ప్ అయినట్టు అనుకోవాలి.

Mad Square Collections:

రెండో వారం కూడా బాగా రాణించిన ఈ సినిమా 3వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకునేలా ఉంది.ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 12.75 cr
సీడెడ్ 3.65 cr
ఉత్తరాంధ్ర 3.60 cr
ఈస్ట్ 2.14 cr
వెస్ట్ 1.24 cr
గుంటూరు 2.01 cr
కృష్ణా 1.66 cr
నెల్లూరు 0.98 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 28.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.02 cr
ఓవర్సీస్ 6.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 36.07 కోట్లు(షేర్)

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 2 వారాల్లో రూ.36.07 కోట్లు షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు బయ్యర్స్ కి రూ.15.07 కోట్ల లాభాలను అందించింది.

‘మాస్ జాతర’ లో ‘ఇడియట్’ రిఫరెన్సులు…!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus