నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin) ..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ (MAD) సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) రూపొందింది. మొదటి నుండి దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ప్రోమోస్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) , రెబా మోనికా జాన్ (Reba Monica John) కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయడం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
అందువల్ల మార్చి 28న రిలీజ్ అయ్యే ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 6.00 కోట్లు |
సీడెడ్ | 2.00 కోట్లు |
ఆంధ్ర(టోటల్) | 7.00 కోట్లు |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 15.00 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.00 కోట్లు |
ఓవర్సీస్ | 3.00 కోట్లు |
వరల్డ్ వైడ్ (టోటల్) | 20.00 కోట్లు(షేర్) |
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా 3 సినిమాలు ఉన్నప్పటికీ… ఎక్కువ అంచనాలు ఈ సినిమా పైనే ఉన్నాయి కాబట్టి.. ‘మ్యాడ్ స్క్వేర్’ కి ఓ మాదిరి పాజిటివ్ టాక్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి.