MAD Trailer: నిజంగా ‘జాతి రత్నాలు’ ని మించేలా ఉంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నె నితిన్ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్’. అనుదీప్(జాతి రత్నాలు ఫేమ్) శిష్యుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ కూడా ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ సమర్పణలో అతని సోదరి సూర్య దేవర హారిక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినినిమా ‘జాతి రత్నాలు’ ని మించి ఉంటుంది అని మేకర్స్ ముందుగానే కాన్ఫిడెంట్ గా చెప్పారు. ముఖ్యంగా నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దీంతో సినిమా పై కూడా మంచి బజ్ ఏర్పడింది. తాజాగా ట్రైలర్ ను ఎన్టీఆర్ లాంచ్ చేయడం జరిగింది. 2 నిమిషాల 18 సెకన్ల నిడివి కలిగిన (MAD) ఈ ట్రైలర్ ఆధ్యంతం వినోదాత్మకంగా సాగింది.

యంగ్ హీరోలు అందరూ కామెడీని బాగా పండించారు అని స్పష్టమవుతుంది. అనుదీప్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కూడా ట్రైలర్లో కనిపించడం విశేషం. అలాగే దసరా ఫేమ్ రవితేజ కూడా వాచ్ మెన్ గెటప్ లో పలికిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే నిజంగానే ‘మ్యాడ్’.. ‘జాతి రత్నాలు’ ని మించి నవ్వులు పంచుతుంది అనే నమ్మకం కలుగుతుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓసారి చూడండి:

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags