రతన్‌ టాటాగా మాధవన్..?

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్ లో నటుడు మాధవన్ నటిస్తున్నట్లు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. మాధవన్ ఫోటో ఉన్న ఓ పోస్టర్ పై రతన్ టాటా అని రాసి ఉన్న పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుండడంతో.. ఈ వార్త నిజమేనని అంతా భావించారు. కానీ అందులో నిజం లేదని అంటున్నాడు మాధవన్. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

దురదృష్టవశాత్తు ఇందులో నిజం లేదని.. కొంతమంది అభిమానుల తమ కోరిక మేరకు ఈ పోస్ట్ ను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నట్లున్నారని.. అంతే తప్ప ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దీనికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఇంతవరకు తనకు దగ్గరకి రాలేదని.. కనీసం చర్చలు కూడా జరగలేదని తేల్చి చెప్పారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధ కొంగర ఇటీవల రతన్ టాటా జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

అప్పటినుండి ఈ బయోపిక్ ను లైకా ప్రోడక్షన్‌లో నిర్మిస్తున్నారని, 2021లో సినిమా షూటింగ్‌ ను కూడా జరుపుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హీరోగా మాధవన్ నటించబోతున్నట్లు మాటలు వినిపించాయి. ఫైనల్ గా ఈ విషయంపై మాధవన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల మాధవన్, అనుష్క జంటగా నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ఓటీటీలో విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ రోల్ పోషించారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus