Madhavi Latha, Sunny: సన్నీపై ఫైర్ అయిన హీరోయిన్ మాధవీలత!

వీజే సన్నీ బిగ్ బాస్ సీజన్5 విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సన్నీ విన్నర్ కావడంతో ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలతో సన్నీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సన్నీ ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత విషయాలను సైతం వెల్లడిస్తున్నారు. అయితే సన్నీ తను విన్నర్ కావడానికి కారణమైన వ్యక్తులను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, ఫ్యాన్ పేజీలు సన్నీ విన్నర్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే వరుసగా ప్రముఖ న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సన్నీ తన గెలుపు విషయంలో కీలక పాత్ర పోషించిన ఛానెళ్లు, ఫ్యాన్ పేజీలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. సన్నీ విన్నర్ గా నిలిచిన తర్వాత గర్వం ప్రదర్శిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా వీజే సన్నీపై ప్రముఖ నటి మాధవీలత ఫైర్ అయ్యారు.

సన్నీ తన కోసం కష్టపడిన రివ్యూయర్లు, ఫ్యాన్ పేజీలను వదిలేసి ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానెళ్లకు, బడా టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని మాధవీలత పేర్కొన్నారు. ఓట్లు వేయమని చెప్పనివాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి సన్నీ తప్పు చేస్తున్నాడని మాధవీలత చెప్పుకొచ్చారు. సన్నీ నిజాయితీ నచ్చి బిగ్ బాస్ లో ఉన్న సమయంలో ప్రమోట్ చేశానని ప్రస్తుతం సన్నీ చేస్తున్న తప్పును వేలెత్తి చూపిస్తున్నానని మాధవీలత అన్నారు.

కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే తనకు చిరాకు అని సన్నీ తప్పు చేస్తున్నాడని మాధవీలత వెల్లడించారు. చాలామంది సన్నీ కోసం పర్సనల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ లా మారిపోయారని వాళ్లకు థ్యాంక్స్ అని ఒక మాట చెబితే అయిపోతుందా అని ఆమె ప్రశ్నించారు. సన్నీ పీఆర్ ఫ్రెండ్ కనిపిస్తే చెంప పగలగొడతానని ఆమె పేర్కొన్నారు. కోపం వస్తే తాను మీడియాలో నిలబెట్టి కడిగేస్తానని మాధవీలత అన్నారు. తాను నచ్చితే నెత్తిన పెట్టుకుంటానని తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తానని మాధవీలత పేర్కొన్నారు. సన్నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదని మాధవీలత అన్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus