Madhumitha: దూరం పెట్టడానికి ట్రై చేస్తే దగ్గరయ్యాడు.. మధుమిత కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి శివ బాలాజీ మధుమిత దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా వీరిద్దరూ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించడంతో వీరి మధ్య ప్రేమ మొదలైందని అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ వీరి ప్రేమ గురించి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే మధుమిత మాట్లాడుతూనేను శివ బాలాజీని మొదటిసారిగా ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమా సమయంలో చూశానని తెలిపారు. మొదటిసారి తనని చూసినప్పుడు ఈ అబ్బాయి బాగున్నాడు అనిపించిందని ఈమె తెలియజేశారు. ఇక ఇంగ్లీష్ కరన్ సినిమాలో దర్శకుడు పరిచయం చేయగా తనతో పరిచయం ఏర్పడిందని తెలియజేశారు. తనని నేనే పలకరించాను అయితే తర్వాత సినిమాల పరంగా తనకు చాలా హెల్ప్ చేయడంతో తనపై ఒక మంచి ఒపీనియన్ ఏర్పడిందని మధుమిత తెలిపారు.

ఇక ఇద్దరి మధ్య హాయ్ అంటే హాయ్ అనే పరిచయం మాత్రమే ఉండేది కానీ శివ బాలాజీ నేను లిప్స్టిక్ వేసుకొని టిష్యూ చేసి పడేసిన తర్వాత ఆ టిష్యూ దాచుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ నా దృష్టిలో పడాలని అనుకున్నారు. ఒకసారి నేను చెన్నై వెళ్లగా ఆయన మిస్ అవుతున్నట్లు మెసేజ్ చేశారు. ఇక ఈ మెసేజ్ చూడగానే నేను తనని దూరం పెట్టడానికి ట్రై చేశానని తెలిపారు.

కానీ శివ బాలాజీ మాత్రం తనకు దగ్గర రావడానికి ప్రయత్నాలు చేశారని తెలిపారు.ఒకరోజు ఏకంగా పెళ్లి చేసుకుందామా అంటూ తానే నాకు ముందుగా ప్రపోజ్ చేశారని ఈ సందర్భంగా మధుమిత తమ లవ్ ప్రపోజల్ గురించి అలాగే లవ్ స్టోరీ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus