ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కళ్యాణి రాజు హీరోయిన్స్ గా రవికిరణ్ వికాస్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం ‘జయమ్మన మగ’. ఇటీవలే రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం కన్నడంలో 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మార్డురి వెంకటరావు ‘మహాబలి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్ర విశేషాలను నిర్మాత మార్డురి వెంకట్రావు తెలియజేస్తూ “హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ అండ్ లవ్ తో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా కన్నడంలో రూపొందిన ‘జయమ్మన మగ’ చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని మా శ్రీ జె. వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో ‘మహాబలి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. హార్రర్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుంది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇది మరొక సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఐదు పాటలు చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేసాడు. అలాగే రీ రికార్డింగ్ అద్భుతంగా చేసాడు. దర్శకుడు రవికిరణ్ టేకింగ్, దునియా పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హై లైట్ గా నిలిచాయి. భారతీబాబు మాటలు, పాటలు అద్భుతంగా రాసారు. త్వరలో ఆడియో రిలీజ్ చేసి అదే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.