ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. కల్కి మూవీ సక్సెస్ తో కల్కి సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మహాభారత్ సీరియల్ లో కృష్ణుని పాత్రలో నటించిన నితీశ్ భరద్వాజ్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీశ్ భరద్వాజ్ మాట్లాడుతూ మ్యాడ్ మ్యాక్స్ సినిమాలను నాగ్ అశ్విన్ స్పూర్తిగా తీసుకుని కల్కి తీశారని అన్నారు.
సెట్టింగుల ద్వారా నాగ్ అశ్విన్ ఈ సినిమా పురాణాలకు సంబంధించిన కథ అనే విధంగా తెలివిగా నడిపించారని పేర్కొన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఫిక్షన్, పురాణాలను కలిపి తెరపై కొత్త ప్రజెంట్ చేసే విషయంలో సక్సెస్ అయ్యాడని నితీష్ భరద్వాజ్ వెల్లడించారు. నా అంచనా ప్రకారం సీక్వెల్ లో ప్రభాస్ రోల్ చనిపోతుందని ఆయన పేర్కొన్నారు.
అశ్వత్థామ, కృష్ణుడు కలిసి విముక్తి కలిగించినట్లు కల్కి సీక్వెల్ లో చూపిస్తారేమో అని నితీష్ భరద్వాజ్ తెలిపారు. సినిమాలో కృష్ణుడి ముఖాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కల్కి సీక్వెల్ లో ప్రభాస్ పాత్ర చనిపోక పోవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నితీశ్ భరద్వాజ్ జోస్యం నిజమయ్యే అవకాశాలు లేవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కల్కి సీక్వెల్ షూటింగ్ 60 శాతం పూర్తైందని అశ్వనీదత్ (C. Aswani Dutt) చెబుతుండగా నాగ్ అశ్విన్ మాత్రం కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తైందని వెల్లడించారు. కల్కి సీక్వెల్ కోసం 2026 వరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది. కల్కి సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.