Mahalakshmi: విడాకుల వార్తలకు ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మహాలక్ష్మీ!

ట్రోలింగ్ దయ వల్ల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది ఓ జంట. వాళ్ళే రవీందర్ – మహాలక్ష్మీ. నిర్మాత అయిన రవీందర్ తన సినిమాలో నటించిన సహనటి అయిన మహాలక్ష్మీ ని పెళ్లి చేసుకోవడంతో.. వీళ్ళ పై ఇండియా వైడ్ ట్రోలింగ్ జరిగింది. అయితే రవీందర్ భారీ కాయంతో ఉండటం.. మహాలక్ష్మీ సన్నగా అందంగా ఉండటంతో .. ఈ జంట పై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరిగింది. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మీ … రవీందర్ ను పెళ్లి చేసుకుంది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

ఏది ఏమైనా ఆ ట్రోలింగ్ వల్ల వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళని చాలా మంది ఇంటర్వ్యూలు చేయడం కూడా జరిగింది. ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు ఈ జంట.. ‘మేము ఒకరినొకరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. గతంలో మా ఇద్దరికీ వీరే వాళ్ళతో పెళ్లి జరిగిన మాట నిజం.. కానీ మేము విడిపోయి ఒంటరిగా ఉండటం వల్లే.. తోడు కోసం పెళ్లి చేసుకున్నాం’ అంటూ ఈ జంట క్లారిటీ ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. తరచూ ఈ జంట పై ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. కొద్దిరోజులుగా వీళ్ళు విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ ప్రచారానికి వీళ్ళు గట్టి జవాబిచ్చారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోని మహాలక్ష్మీ షేర్ చేసి.. “నువ్వు నా భుజం పై చెయ్యి వేసినప్పుడు నాకు కొండంత ధైర్యం వస్తుంది. ఏదైనా చేయగలను అనే నమ్మకం కలుగుతుంది. (Mahalakshmi) నా మనసు నిండా నువ్వే అమ్ము” అంటూ రాసుకొచ్చింది. దీంతో వీరి విడాకుల ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus