ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడిపాను: రవీందర్

తమిళ నాట పాపులర్ అయిన మహాలక్ష్మి రవీంద్ర ఎంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన రవీంద్ర బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన మహాలక్ష్మిని ఇటీవల వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావడంతో వీరి పెళ్లి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వీరిద్దరూ కూడా తమ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని కొంతకాలంగా ప్రేమించుకున్న తర్వాత ఇటీవల వివాహం చేసుకున్నారు.

అయితే వీరిద్దరూ ఇలా రెండవ వివాహం చేసుకోవడంతో సోషల్ మీడియాలో వీరి గురించి తెగ ట్రోల్ చేశారు. ఇలా వీరిద్దరూ కూడా వారి గురించి వినిపిస్తున్న ట్రోలింగ్స్ ని లెక్కచేయకుండా వారి వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి జరిగి ఇప్పటికీ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇద్దరు కూడా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహాలక్ష్మి రవీందర్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ పెళ్లి జరిగి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా మహాలక్ష్మి రవీంద్ర వందరోజుల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. రవీంద్ర తన భార్య మహాలక్ష్మి కోసం ఒక అందమైన పోస్ట్ షేర్ చేశాడు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశాడు. వంద రోజులు పూర్తి అయ్యాయి. అవును… అమ్మూ నేను వందరోజులు పూర్తి చేసుకున్నాము. ఈ క్రమంలో ఈ పోస్ట్ కి ఒక చక్కటి క్యాప్షన్ రాయాలని చాలా ప్రయత్నించాను. నాటకం రాయలేక నాకు మనసులో అనిపించింది రాశాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఆమ్మూ నీ తోడులో 37 ఏళ్ల తర్వాత 100 రోజుల పాటు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపాను అంటూ రాసుకొచ్చాడు. ఇలాగే మరింత ప్రేమతో, శ్రద్ధతో, సరదాగా పోట్లాడుకుంటూ నాతో నడవండి. నీ వల్లే నేను సంతోషంగా జీవిస్తానని అని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా వీరిద్దరూ వందరోజుల పెళ్లి వేడుక సందర్భంగా వారి అభిమానులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి కొంతమంది మాత్రం ఎప్పటిలాగే వీరి గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం రవీంద్ర షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus