Maharaja First Review: విజయ్ సేతుపతి 50వ సినిమా ‘మహారాజ’ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే?
- June 13, 2024 / 11:22 AM ISTByFilmy Focus
డబ్బింగ్ సినిమా ‘పిజ్జా’ తో తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) . ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) ‘ఉప్పెన’ (Uppena) వంటి స్ట్రైట్ తెలుగు సినిమాల్లో అతను నటించాడు. ‘మాస్టర్’ (Master) ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలు అతని ఇమేజ్ ను డబుల్ చేశాయి. అయితే హీరోగా అతను సక్సెస్ కొట్టి చాలా కాలం అయ్యింది. అప్పుడే అతను 50 వ సినిమాని కూడా కంప్లీట్ చేసి… దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

అవును విజయ్ సేతుపతి 50వ మైల్ స్టోన్ మూవీ ‘మహారాజ’ జూన్ 14 న రిలీజ్ కాబోతుంది. నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ప్యాషన్ స్టూడియోస్’, ‘ది రూట్’ సంస్థలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక ఈరోజు తమిళంలో ‘మహారాజ’ ప్రీమియర్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ చెబుతున్నారు.

ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా… గ్రిప్పింగ్ గా సినిమా సాగిందని..! ‘లక్ష్మీ’ ఎవరు అనే అంశాన్ని హైలెట్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. సినిమాపై ఆసక్తి పెరగడానికి అది కారణమైంది. సినిమాలో దాన్ని రివీల్ చేసిన విధానం కూడా బాగుందట. స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్ లు కట్టిపడేస్తాయట. కచ్చితంగా విజయ్ సేతుపతి 50 వ సినిమా సూపర్ హిట్ అని అంతా అంటున్నారు. మరి తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి











