మహేష్ బాబు 25 వ చిత్రంగా వస్తున్న ‘మహర్షి’ చిత్రం మే9న న విడుదల కాబోతుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు,పీవీపీ, అశ్వినీదత్ వంటి బడా నిర్మాతలు కలిసి నిర్మించారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఇక ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ను జరీ చేసారు. ఇక ఈ చిత్రం పై మొదట కొంచెం నెగెటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ లుక్స్ ‘శ్రీమంతుడు’ చిత్రంలా ఉన్నాయని టీజర్ కూడా ఆ చిత్రంలానే ఉందని అంతేకాదు, ‘భరత్ అనే నేను’ ఛాయలు కూడా ఉన్నాయని కొందరు కామెంట్స్ చేసారు. అయినప్పటికీ మహేష్ చిత్రం కాబట్టి హైప్ అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే ట్రైలర్ విడుదలయ్యాక మొత్తం నెగెటివిటీ పోయిందనే చెప్పాలి.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం చూస్తే… సూపర్ స్టార్ కృష్ణ ‘పాడిపంటలు’ చిత్రం ఎంత హిట్టయ్యిందో… మహేష్ కెరీర్లో ‘మహర్షి’ చిత్రం అలాంటి హిట్టవుతుందని చెబుతున్నారు. ‘మహర్షి’ చిత్రం ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కీలకంగా ఉంటుందట.రిజిస్టర్ ఆఫీస్ లు రైతుల భూముల సీన్ ఆకట్టుకుంటాయట. దీంతో పాటూ మహేష్, సాయి కుమార్ మధ్య వచ్చే ఓ సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందట. విలన్ కి హీరో వార్నింగ్ ఇవ్వడం వంటి సీన్లు కూడా ఈ చిత్రంలో ఉన్నాయట. అల్లరి నరేష్ పాత్ర, ‘చోటి చోటి’ అలాగే ‘పదరా పదరా’ ‘ఇదే కథ’ పాటలు విజువల్ గా బాగా వచ్చాయట.
అయితే ‘మహర్షి’ రన్ టైం.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కాస్త లెంగ్త్ ఎక్కువ అనే ఫీలింగ్ కూడా కలుగుతుందట. అయితే క్లైమాక్స్ బాగా వచ్చిందట. కాస్త ‘శ్రీమంతుడు’ ఛాయలు కనిపించినా అది మొత్తంలో కనపడవంట. ఓవర్ ఆల్ గా ‘మహర్షి’ చిత్రం పర్వాలేదనిపిస్తుందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సంవత్సం ‘వినయ విధేయ రామ’ తర్వాత ఏ పెద్ద సినిమా రాలేదు. పెద్ద చిత్రమైనా అది డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు ‘మహర్షి’ తప్ప మరే పెద్ద సినిమా లేదు. అందులోనూ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ‘మహర్షి’ చిత్రం పెద్ద హిట్టవుతుందని వారు తెలిపారు. మరి రెజల్ట్ వారు చెప్పినట్టే ఉంటుందో లేదో తెలుసుకోవాలంటే మే 9 వరకూ వేచి చూడాల్సిందే.