‘మహావతార్ నరసింహ’ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉండటం వల్ల.. మొదట్లో దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో స్క్రీన్స్, కలెక్షన్స్ పెరుగుతూనే వచ్చాయి.దర్శకుడు అశ్విన్ కుమార్ మహావిష్ణువు 9 అవతారాలను యానిమేటెడ్ వెర్షన్లుగా.. 9 సినిమాలుగా తీస్తానని గతంలో వెల్లడించారు.
అందులో మొదటి భాగంగా ‘మహావతార్ నరసింహ’ రూపొందింది. 13 రోజులు అయినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు తగ్గలేదు. ‘కింగ్డమ్’ వంటి కొత్త సినిమాని కూడా డామినేట్ చేసేసింది అని చెప్పాలి. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
ఏపీ+తెలంగాణ | 14.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ | 57.8 cr |
ఓవర్సీస్ | 3.55 cr |
వరల్డ్ టోటల్ | 75.7 cr (షేర్) |
‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 13 రోజుల్లో ఏకంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.75.7 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.60.7 కోట్ల లాభాలతో అంటే.. ఆల్మోస్ట్ 4 రెట్లు పైనే లాభాలు అందించింది అని చెప్పాలి. 13వ రోజు కూడా మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్లోటింగ్ కూడా ఈ సినిమాకి ఎక్కువగా కనిపిస్తుంది. 2వ వీకెండ్ కూడా ఈ సినిమా భారీగా క్యాష్ చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది అని చెప్పాలి.