Mahaveerudu: శివ కార్తికేయన్ సినిమాకి ఆదిలోనే పెద్ద దెబ్బ!

‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి సినిమాలతో తెలుగులో కూడా కొంత మార్కెట్ ఏర్పరుచుకున్నాడు తమిళ హీరో శివ కార్తికేయన్. ఇప్పుడు ‘మహావీరుడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అదితి శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ‘శాంతి టాకీస్‌’ పతాకంపై అరుణ్‌ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్స్ లో ఒకటైన ‘ఏషియన్ సినిమాస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుంది.

ఈ చిత్రం (Mahaveerudu) ట్రైలర్ బాగుంది. జూలై 14 న అంటే ఈరోజే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఆరంభంలోనే ఈ చిత్రానికి ఊహించని దెబ్బ తగిలింది అని చెప్పాలి. విషయంలోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రిలీజ్ కాలేదు. మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. అంతేకాదు బయట రాష్ట్రాల్లో కూడా తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు. తమిళంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. ఓవర్సీస్ లో కూడా తమిళ వెర్షన్ రిలీజ్ అయ్యింది.

అయితే తెలుగు వెర్షన్ కి సంబంధించిన కీ అందకపోవడం వల్ల.. మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినట్టు సమాచారం. మేకర్స్ ఇప్పుడు ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరికాసేపట్లో షోలు పడొచ్చు. మరి తమిళ వెర్షన్ టాక్ అయితే మిక్స్డ్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఏది ఏమైనా.. అసలే ప్రమోషన్ చేయలేదు అనే కంప్లైంట్ ఉన్న ఈ సినిమాకి మార్నింగ్ షోలు పడకపోవడం అంటే.. ఓపెనింగ్స్ పై గట్టి దెబ్బ పడుతుందనే చెప్పాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus