Guppedantha Manasu August 15th: డిబిఎస్టీ కాలేజ్ కోసం రంగంలోకి దిగిన రిషి!

  • August 15, 2023 / 03:43 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…పేపర్లో కాలేజ్ గురించి రావడంతో శైలేంద్ర జగతి మహీంద్రాలను నిలదీస్తారు ఇలా కాలేజ్ స్టూడెంట్ పడిపోవడానికి కారణం ఏంటి..నాకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అని శైలేంద్ర నిలదీయడంతో ఆయన మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ జగతి మాట్లాడుతుంది. నువ్వు కనీసం కాలేజ్ బోర్డ్ మెంబర్ అనే విషయం కూడా ఎవరికీ తెలియదు ఎందుకు సమాధానం చెప్పాలి అంటూ మాట్లాడటంతో శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు.

ఈ కాలేజ్ మేనేజ్ చేయడం మీ వల్ల కాదు అని నేను ఆరోజు చెప్పాను అందుకే ఈ కాలేజ్ వేరే వాళ్ళ హ్యాండ్ అవర్ చేయాలని నేను చెప్పానని శైలేంద్ర చెప్పడంతో అసలు ఈ కాలేజ్ ఎవరికి హ్యాండ్ అవర్ చేసే ప్రసక్తే లేదని జగతి చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతుంది. ఈ కాలేజ్ మా మామయ్య గారు వేసిన పునాది ఈ సామ్రాజ్యాన్ని రిషి విస్తరించారు. ఈ కాలేజ్ బాధ్యతలు వేరే వాళ్లకు అప్ప చెప్పే ప్రసక్తే లేదని జగతి చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతుంది.అయినా ఇంతగా అడుగుతున్నావ్ ఇందులో నీ ప్రమేయం ఏమైనా ఉందా అంటూ మహేంద్ర మాట్లాడుతాడు. అవమానం ఉంటే సరిపోదు బాబాయ్ ఆధారాలు కూడా ఉండాలి అంటూ శైలేంద్ర మాట్లాడుతారు.

మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏదో ఒక రోజు ఈ కాలేజీ మూతపడటం ఖాయం అంటూ శైలేంద్ర మాట్లాడటంతో కోపంతో రగిలిపోతున్నటువంటి మహేంద్ర ఒక్కసారిగా శైలేంద్ర అంటూ తనపై చేయి ఎత్తుతారు కానీ కొట్టకుండా ఆగిపోతారు. నీ గురించి అన్ని నిజాలు తెలుసినా కేవలం అన్నయ్య కోసం మాత్రమే నిజాలు బయట పెట్టలేదు కానీ ఈ విషయంలో మాత్రం నీ ప్రమేయం ఉందని తెలిస్తే మాత్రం తప్పకుండా నేను అన్ని విషయాలు అన్నయ్య ముందు బయట పెట్టాల్సి వస్తుంది అంటూ మహేంద్ర వార్నింగ్ ఇస్తాడు దాంతో శైలేంద్ర అది చూద్దామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు తన కాలేజీ గురించి ఆలోచిస్తూ రిషి బాధగా కూర్చుని ఉంటారు అప్పుడు అక్కడికి వసుధార వచ్చి కాలేజీ గురించి కదా సార్ మీరు ఇలా ఆలోచిస్తున్నారు మన కాలేజ్ రోజు రోజుకు స్ట్రెంత్ తగ్గిపోతుంది తిరిగి మన కాలేజీకి పూర్వ వైభవం రావాలి అంటే మీరు అక్కడ అడుగు పెట్టాలి సార్ అని చెప్పడంతో మన కాలేజ్ ని జగతి మేడం చాలా బాగా హ్యాండిల్ చేస్తారు కానీ ఏం జరిగింది అంటూ రిషి అనగ అక్కడ పరిస్థితులు జగతి మేడం చేతులు దాటిపోయాయి అంటూ మాట్లాడుతుంది.కాలేజీ స్ట్రెంత్ పెరగాలి అంటే నేను కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు నేను ఆ కాలేజీలోకి అడుగు పెట్టను అంటూ రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు తన క్యాబిన్ లో ఉండగా అక్కడికి పాండియన్ బ్యాచ్ వస్తుంది. సర్ రమ్మన్నారు అని అడగడంతో రండి కూర్చోండి అని చెప్పి రిషి వారితో సస్పిసియస్ కాఫీ గురించి తెలుసా అని అడుగుతాడు రిషి. దాని గురించి పాండ్యన్ ఫ్రెండ్ వివరిస్తాడు. గుడ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా అదే ప్రాసెస్ తీసుకొని వద్దాము ఎవరైనా పిల్లల్ని చదివించగలిగే స్తోమత ఉన్న వాళ్ళని ఒక స్టూడెంట్ బాధ్యత తీసుకునే లాగా చేద్దాము అందుకోసం నేను డిబిఎస్టి కాలేజీ ని సెలెక్ట్ చేశాను. మన టార్గెట్ 500 మంది అని చెప్పడంతోఅలాగే చేద్దాం సార్ అంటూ పాండియన్ బ్యాచ్ ఒకటి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు ఏంజెల్ పెళ్లి గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది అంతలో రీషి అక్కడికి రావడం తనని కూడా గమనించకుండా ఆలోచిస్తూ ఉంటుంది.ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు విశ్వనాథం గురించి కదా నేను ఆయన గురించి ఆలోచించొద్దు నేను చూసుకుంటాను అని చెప్పానని రిషి తనకు చెబుతాడు.బోంచేసావా అని అనడంతో తాతయ్యకు పెట్టాను రిషి అంటుంది మరి నువ్వు తిన్నావా అంటే లేదు అని చెబుతుంది ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రా రిషి అనగా నాకు ఆకలిగా లేదని రిషి వెళ్ళిపోతాడు

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus