ఏ స్టార్ హీరో అయినా సరే.. వాళ్ళు చేసిన సినిమాలు ప్లాప్ అని చెప్పుకోవడానికి ఇష్టపడరు.అటువంటి సందర్భాలు వచ్చినా..దాటెయ్యలని చూస్తుంటారు. కానీ మహేష్ బాబు మాత్రం తాను నటించిన సినిమాలు ఆడకపోతే.. వాటి రిజల్ట్ గురించి చెప్పడానికి సిగ్గుపడడు. అనేకసార్లు తన సినిమాలు ప్లాప్ అని బహిరంగంగానే ఒప్పుకున్నాడు.దానికి కారణం కూడా తనే అని చెప్పుకొచ్చాడు. అయితే ఒకానొక సందర్భంలో తాను నటించిన ఓ సినిమా ప్లాప్ అని చెబుతూనే..
ఆ సినిమా వల్ల మంచే జరిగిందని తెలిపాడు మహేష్. అదెలా? ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు హీరోగా బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘వంశీ’ చిత్రం ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్ళిపోయిందో చాలా మందికి తెలీదు. మహేష్ కూడా సరిగ్గా ఇలాగే సమాధానం ఇచ్చాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించిన చిత్రం కాబట్టి.. బ్లైండ్ గా ఓకే చేసేసానని .. ఇష్టం లేకుండా చెయ్యడంతో ఆ సినిమా బాగా ఆడలేదేమో అని మహేష్ చెప్పుకొచ్చాడు.
అయితే ఆ సినిమా ప్లాప్ అయినా తనకు మంచే జరిగిందని.. ఇష్టం లేకుండా ఆ సినిమా చేసినప్పటికీ నమ్రతతో పరిచయం ఏర్పడిందని.. నాకు బెటర్ హాఫ్ దొరికిందని మహేష్ చెప్పుకొచ్చాడు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో నమ్రతతో ఇంటరాక్షన్ బాగుందని.. అది ఎప్పటికీ మర్చిపోలేనని కూడా మహేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.ఇక మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పరశురామ్(బుజ్జి) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.