కమల్ హాసన్ పై మహేష్ కామెంట్స్..!

కేవలం కమర్షియల్ కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని.. తన స్టార్ ఇమేజ్ ను కాపాడుకోవాలని ఆయన ఎప్పుడూ పరితపించలేదు. ఛాలెంజింగ్ రోల్స్ ఉన్న కథల్నే ఎంచుకుని.. కేవలం తన నటన తోనే ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసే నటుడు. ఆయన మరెవరో కాదు మన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఈయన్ని చూసి ఎంతో మంది నటన పట్ల ఆసక్తి పెంచుకుని ఇండస్ట్రీకి వచ్చారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈరోజు(నవంబర్ 7న) ఆయన పుట్టిన రోజు కావడంతో ఎంతో మంది నటీనటులు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మన ‘కమల్ హాసన్’ కు నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన స్టైల్ లో ట్వీట్ చేసి విష్ చేసాడు.

Mahesh Babu About Kamal Haasan1

మహేష్ తన ట్విట్టర్ ద్వారా కమల్ హాసన్ కు విషెస్ చెబుతూ.. ” కమలహాసన్ సార్… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీరంగానికి మీరందించిన సహకారం అసాధారణం. అలాగే, సినీ రంగంలో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోన్న మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఇది నిజంగా చాలా స్ఫూర్తివంతమైన విషయం. మీ సహకారం సినీ ఇండస్ట్రీకి ఇంకా కావలి. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

Mahesh Babu About Kamal Haasan2

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus