సూపర్‌స్టార్ కృష్ణ అంటే ధైర్యం… ధైర్యం అంటే కృష్ణ అంటారు. అంతేకాదు దాంతోపాటు పక్కా ప్లానింగ్ అనే పేరు కూడా ఉంది ఆయనకు. తన సినిమాల విషయంలో కానీ, కొడుకు మహేష్‌బాబు సినిమా కెరీర్ గురించి కృష్ణ ప్లానింగ్ తెలిసిన వాళ్లు ఇదే మాట అంటారు. మహేష్‌బాబు ఇండస్ట్రీలోకి రావడం, సినిమాల్లో రాణించడం, దూసుకుపోవడం వెనుక… తండ్రి కృష్ణ పాత్ర చాలా ఉంది. ఈ విషయాల్ని మహేష్‌బాబు ఇటీవల చెప్పుకొచ్చారు.
మహేష్‌బాబు ఐదారేళ్ల వయసు వచ్చినప్పటికే… ఐదు సినిమాలు చేసేశాడు, ఈ కుర్రాడు అద్భుతంగా నటిస్తున్నాడు అనిపించుకున్నాడు. అదెలా సాధ్యమైందో కూడా చెప్పాడు మహేష్. స్కూల్‌లో చదువుకునేటప్పుడు సెలవుల సమయంలోనే సినిమాల్లో నటించేలా కృష్ణ చూసుకున్నారట. ఏప్రిల్, మేలో కృష్ణ ఎక్కువగా ఊటీలో షూటింగ్ ఉండేలా చూసుకునేవారు. సమ్మర్ హాలీడేస్ ఆయన అక్కడే గడిపేవారు. పిల్లలు కూడా అక్కడే ఉండటంతో… షూటింగ్ చేసేసేవారట. అలా ఐదారేళ్లలో ఐదు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసేశారట.
చిన్నతనంలో సినిమాల్లో నటించడం, తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మహేష్‌కు కెమెరా అంటే భయం పోయిందట. నటించడం అంటే మామూలు పనే కదా అనే ఫీల్ వచ్చిందట. అంత సింపుల్‌గా నా కెరీర్ మలిచేశారు నాన్న అంటూ మహేష్ గొప్పగా చెప్పుకొచ్చాడు. దీంతోపాటు మహేష్ మరొక విషయం కూడా చెప్పాడు. ఆ రోజుల్లో కృష్ణ 24X7 పని చేసేవారట. సంవత్సరంలో ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకునేవారు కాదు. అయితే పర్సనల్ లైఫ్ ఎప్పుడూ మిస్ అవ్వలేదట.
నాన్న ఎలా చేశారో తెలియదు కానీ… 365 రోజులు పని చేసేవారు, అయితే రోజూ ఆయనతో స్పెండ్ చేసేవాళ్లం. ఉదయం టిఫిన్ టైమ్‌లో ఉండేవారు. రాత్రికి మాతో కలసి భోజనం చేసేవారు. నిద్రపోయే ముందు వచ్చి మమ్మల్ని కలిసేవారు. ఎలా అంత పక్కాగా ప్లాన్ చేసుకునేవారో నాకూ తెలియదు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. నా పిల్లలతో నేను అలా ఉండాలనే టూర్స్ ప్లాన్ చేస్తుంటా అని చెప్పాడు మహేష్. ఎంతైనా కృష్ణ మామూలోడు కాదు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!