‘వెంకీమామ’ పై ప్రశంసలు కురిపించిన మహేష్

తనకి నచ్చితే.. ఏ సినిమా గురించి అయినా ట్వీట్ వేయడం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు అలవాటే..! అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. వెంటనే స్పందిస్తాడు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బిజీగా గడుపుతున్న మహేష్.. ఇటీవల విడుదలైన ‘వెంకీమామ’ చిత్రం పై తన అభిప్రాయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను రాబడుతోంది. నిజ జీవితంలో మామా అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్,నాగచైతన్య లు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై ముందు నుండీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని దర్శకుడు కె.ఎస్.రవీంద్ర వందకు వంద శాతం అందుకున్నాడనే చెప్పాలి.

ఇక ‘వెంకీమామ’ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ” ‘వెంకీమామ’ సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెంకటేష్ – నాగ చైతన్య ల.. మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ పై వెలిగిపోయింది. అలాగే సినిమాలో కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. వెంకటేష్- మహేష్ బాబు గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో లానే బయట కూడా అన్నదమ్ములు లానే కలిసుంటారు వీరిద్దరూ..! ఒక విధంగా మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి అంటే వీళ్ళిద్దరే కారణమని చెప్పడంలో సందేహం లేదు.

1

2

3

4

5

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus