మహేష్ బన్నీ కాంబో మూవీ కావాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్, రాజమౌళి కాంబో సినిమాలతో బిజీగా ఉన్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప2 సినిమాతో బిజీగా ఉండటం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణ, వ్యాపారవేత్త రవిల వివాహం ఘనంగా జరగగా ఈ వివాహ వేడుకకు బన్నీ, మహేష్ హాజరు కావడంతో పాటు ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు హీరోలు కనిపించడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలను చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్, శంకర్ లాంటి ప్రతిభావంతులైన దర్శకులు ఈ కాంబినేషన్ పై దృష్టి పెడితే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమేమీ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ, మహేష్ లకు సమస్య లేకపోతే ఈ కాంబినేషన్ దిశగా దర్శకనిర్మాతలు అడుగులు వేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో మల్టీస్టారర్స్ హవా మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బన్నీ మహేష్ లకు వేర్వేరుగా 300 నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్ లో మార్కెట్ ఉంది. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే 4000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ హవా పెరుగుతోంది.

టాలీవుడ్ స్టార్స్ సైతం కథ నచ్చితే మల్టీస్టారర్స్ లో నటించడానికి అభ్యంతరం లేదని చెబుతున్నారు. బన్నీ, మహేష్ రాబోయే రోజుల్లో కలిసి నటిస్తారేమో చూడాల్సి ఉంది. పుష్ప ది రైజ్ సినిమాలో నటించే అవకాశం మొదట మహేష్ కు రాగా వేర్వేరు కారణాల వల్ల మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అయితే ఇదే కథలో బన్నీ నటించి పుష్ప ది రైజ్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus