త్రివిక్రమ్‌ – మహేష్‌ సినిమా విషయంలో తప్పెవరిది? ఏమవుతోంది?

కొన్ని సినిమాలను అనుకునేటప్పుడు, ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు ఏమని అనుకుంటారో కానీ.. ఎంత ప్రయత్నించినా అనుకున్న సమయానికి, అనుకున్నట్లు జరగదు అంటుంటారు. అలా టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న సినిమాల్లో మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా ఒకటి. #SSMB28గా చాలా నెలల క్రితం ప్రారంభమైన ఈ సినిమా విషయంలో ఏదీ అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదు. తాజాగా ఈ సినిమా విషయంలో మరోసారి వాయిదా మాట వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే ఈ మధ్య బాలీవుడ్‌లో పెద్ద సినిమా విడుదల తేదీని ప్రకటించినంత మాత్రాన కచ్చితంగా ఆ డేట్‌కే రిలీజ్‌ చేస్తార అనే పరిస్థితులు లేవనే చెప్పాలి. గత నాలుగేళ్లలో ఏ స్టార్ హీరో సినిమా కూడా ఇలా చెప్పిన టైంకి వచ్చిన దాఖలాలు లేవు అని చెప్పొచ్చు. అయితే కొన్ని సినిమాల విషయంలో అనుకున్న తేదీకి షూటింగ్‌ కూడా మొదలు కావడం లేదు. దీంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక టీమ్‌ తలలు పట్టుకుటోంది అని సమాచారం.

తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28వ సినిమా రిలీజ్‌ డేట్‌ను మళ్లీ మారుస్తారు అని అంటున్నారు. రీసెంట్ ఇన్ఫర్మేషన్‌ ప్రకారం ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుందని నిర్మాత చెప్పారు. దీంతో ఆగస్టులో దుమ్ముదులిపేద్దాం అని అనుకున్నారు ఫ్యాన్స్‌. అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్‌ మొదలుకాలేదు. నిజానికి సంక్రాంతి తర్వాత షూటింగ్‌ అన్నారు, ఆ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్‌ వీక్‌లో అన్నారు. ఇప్పటివరకు షూటింగ్‌ మొదలవ్వలేదు. దీంతో సినిమా ఆగస్టులో రావడం కష్టం అంటున్నారు.

త్రివిక్రమ్‌ సినిమా అంటే కనీసం ఏడాది పడుతుంది ఓపెనింగ్‌ నుండి అని అంటారు. అందులో మహేష్‌ సినిమా కాబట్టి.. ఇంకా ఏడాది పక్కా అంటుంటారు. కానీ ఇప్పుడు చూస్తే ఆరు నెలలకే రిలీజ్‌ అన్నారు ఆ మధ్య. ఆ లెక్కన అయినా దసరాకే ఈ సినిమా రావాలి. అలా జరగాలన్నా ఈ నెలలోనో, వచ్చే నెలలోనే సినిమా మొదలవ్వాలి. అయితే ఈ విషయంలో పక్కాగా చెప్పలేం అంటున్నాయి సినిమా సన్నిహిత వర్గాలు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus