Mahesh Babu, Vijay: అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తున్న మహేష్, విజయ్!

ఈ మధ్య కాలంలో అభిమానులు యూట్యూబ్ వ్యూస్ కు కూడా ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ లైక్స్, వ్యూస్ విషయంలో తమ హీరోలు కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట మే నెల 12వ తేదీన రిలీజ్ కానుండగా విజయ్ నటించిన బీస్ట్ మూవీ ఏప్రిల్ నెల 14వ తేదీన రిలీజ్ కానుంది. కేజీఎఫ్ ఛాప్టర్2 కూడా అదే తేదీన విడుదలవుతున్నా విజయ్ మాత్రం తన సినిమా రిలీజ్ విషయంలో తగ్గడని తెలుస్తోంది.

అయితే సర్కారు వారి పాట సినిమా నుంచి విడుదలైన కళావతి, బీస్ట్ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుత్తు పాటలు యూట్యూబ్ లో వ్యూస్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం. విజయ్ కోలీవుడ్ లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అయితే మహేష్ టాలీవుడ్ లో సూపర్ స్టార్ కావడం గమనార్హం. యూట్యూబ్ లో కళావతి సాంగ్ 50 మిలియన్ల వ్యూస్ ను సాధిస్తే బీస్ట్ లోని అరబిక్ కుత్తు సాంగ్ ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించగా బీస్ట్ సినిమాలో విజయ్ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించారు. సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా బీస్ట్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. మహేష్, విజయ్ సినిమాల పాటలు యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో అభిమనుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సర్కారు వారి పాట, బీస్ట్ సినిమాలు కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో దాదాపుగా మార్పు లేనట్టేనని తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus