Mahesh: వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన మహేష్… గుంటూరు షూటింగ్ స్టార్ట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండు వారాలుగా లండన్ వెకేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన లండన్ వెకేషన్ పూర్తిచేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత రెండు వారాలుగా మహేష్ బాబు తన భార్య నమ్రత కొడుకు గౌతమ్ కుమార్తె సితారతో కలిసి లండన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ గడిపారు.

ఇలా లండన్ వెకేషన్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ఫ్యామిలీ తిరిగి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఇక వెకేషన్ కోసం మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా ఇన్ని రోజులు పాటు మహేష్ బాబు లండన్ లో ఉన్నారని తెలుస్తుంది. తన కుమారుడి గౌతమ్ చదువులకు సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తి చేసుకున్నారని అలాగే తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేస్తున్న తరుణంలో డాక్టర్లని కన్సల్టేషన్‌ వ్యవహారాలు కూడా ఈ ట్రిప్‌లో చూసుకున్నారని సమాచారం.

ఇక ఈ వెకేషన్ లో భాగంగా మహేష్ బాబు (Mahesh) తన పుట్టినరోజు వేడుకలను కూడా తన ఫ్యామిలీతో కలిసి లండన్ లోనే సెలెబ్రేట్ చేసుకున్నారు. ఏది ఏమైనా తన ఫ్యామిలీతో కలిసి ఇన్ని రోజులపాటు వెకేషన్ లో ఉన్నటువంటి మహేష్ తిరిగి రావడంతో ఇకపై గుంటూరు కారం సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుందని తెలుస్తుంది.హైదరాబాద్ చేరుకున్నటువంటి మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. ఇక ఈ సినిమాని త్వరలోనే పూర్తి చేసి మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం సిద్ధం కాబోతున్నారని తెలుస్తుంది సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ పండగ బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus