Mahesh Babu: కొత్త ఫోటోని షేర్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఈ ఏడాది 3 విషాదాలు చోటు చేసుకున్నాయి. తన అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ.. మరణించారు. ఒకే ఏడాదిలో 3 విషాదాలను తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. నవంబర్ 15 న సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించారు. ఆయన మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. మహేష్ కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు.

ఎక్కువగా ఆయన ఫోన్లు మాట్లాడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొనడం ఇప్పట్లో కష్టమని అంతా అనుకున్నారు. కానీ మహేష్… తిరిగి తన పనిలో బిజీ కావాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ముందుగా మౌంటైన్ డ్యూ కొత్త యాడ్ లో నటించడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని మహేష్ తెలుపుతూ ఓ ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫొటోలో లాంగ్ హెయిర్ తో మహేష్ కనిపిస్తున్నాడు. ‘బ్యాక్ టు వర్క్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు.

కెమెరామెన్ సురేష్ నటరాజన్ ఈ ఫోటో తీసినట్టు మహేష్ క్రెడిట్స్ ఇచ్చాడు. మహేష్ ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడంతో అభిమానులు ఆనందంతో కామెంట్లు పెడుతున్నారు. ‘వుయ్ ఆర్ విత్ యు అన్నా’ ‘లవ్ యు అన్నా’ ‘వెయిటింగ్ ఫర్ మహేష్ 28’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన మహేష్ బాబు…

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ డిసెంబర్ 2వ వారం నుండి ప్రారంభం కాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. 2023 లో ఈ బడా ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో రూపుదిద్దుకోనుంది. కె.ఎల్.నారాయణ్ ఈ చిత్రానికి నిర్మాత.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus