Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

సాధారణంగా స్టార్స్ ఫ్యామిలీ నుండి హీరోలే ఎక్కువగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అమ్మాయిలను సినిమాల్లోకి తీసుకురావడానికి స్టార్స్ ఇష్టపడరు. అయినప్పటికీ శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, నిహారిక, మంచు లక్ష్మీ వంటి వాళ్ళు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ అభిప్రాయాలు తప్పు అని ప్రూవ్ చేశారు. కానీ ఎక్కువ శాతం అయితే స్టార్ హీరోల ఫ్యామిలీస్ నుండి అమ్మాయిలు ఇండస్ట్రీకి ఇవ్వరు అనే స్టేట్మెంట్ పాస్ అయ్యింది.

Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ విషయానికే వద్దాం. గతంలో బాలకృష్ణ నటించిన ‘టాప్ హీరో’ సినిమాలో కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని హీరోయిన్ గా నటించాల్సి ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి ఆ సినిమాకు దర్శకుడు. ‘హీరోగా కృష్ణ పని అయిపోయింది’ అని అంతా అనుకుంటున్న టైంలో ఎస్వీ కృష్ణారెడ్డి ‘నెంబర్ 1’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చి కృష్ణ బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది ప్రూవ్ చేశాడు.

ఆ కృతజ్ఞతతో మంజులని ‘టాప్ హీరో’ సినిమాలో హీరోయిన్ గా అడిగితే కృష్ణ కాదనలేకపోయారు. కానీ కృష్ణ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు. ముఖ్యంగా కృష్ణ సొంత ఊర్లో అయితే ఎస్వీ కృష్ణారెడ్డి కటౌట్ తీసుకెళ్లి బందరు చెరువులో పడేసి తమ నిరసన తెలిపారు. ఇక మరికొంతమంది ఫ్యాన్స్ అయితే పద్మాలయ స్టూడియోస్ ముందుకు వచ్చి ‘ఆత్మహత్య చేసుకుంటాం’ అని కృష్ణని బ్లాక్ మెయిల్ చేశారు.

దీంతో మంజులని ‘టాప్ హీరో’ సినిమా నుండి తప్పించారు కృష్ణ.అలాంటి ఫ్యామిలీ నుండి ఇప్పుడు ఓ అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండటం అందరికీ షాకిస్తుంది. విషయంలోకి వెళితే.. మహేష్ బాబు అన్న కూతురు భారతి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట. దర్శకుడు తేజ కొడుకు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా భారతిని తీసుకున్నట్లు తెలుస్తుంది.మరోపక్క రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘అతను ఓకే కానీ రమేష్ బాబు కూతురు కూడా సినిమాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది?’ అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.

2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus