మహేష్ బాబు ఇప్పుడు బాగా తగ్గడం ఏంటి… అసలు లావు ఎప్పుడయ్యాడు అని ‘జబర్దస్త్’ ఆటో పంచ్ లు అప్పుడే మొదలు పెట్టెయ్యకండి. అప్పట్లో అయితే ఓ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అయితే ఏమాత్రం కథ వినకుండా మహేష్ బాబు సినిమా చెయ్యడానికి ఓకే చెప్పేసేవాడు. అంతేకాదు పెద్ద డైరెక్టర్ చెప్పిన చిన్న లైన్ నచ్చినా సినిమా చెయ్యడానికి ఓకే చెప్పేసేవాడు. అలా డిజాస్టర్ లు మూట కట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక ఎక్స్ పెరిమెంట్ లు చెయ్యను.. కమర్షియల్ సినిమాలే చేస్తాను అని మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ టైములో ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత వెంటనే ఆ సినిమా హిట్ అవ్వడం… తరువాత ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు కూడా హిట్ అవ్వడం జరిగాయి. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ ను పక్కన పెట్టేస్తే… ఓ యంగ్ డైరెక్టర్, 100 రోజుల్లో సినిమా ఫినిష్ చెయ్యడం, స్టార్ హీరోయిన్ కూడా లేకుండా ఓ మీడియం రేంజ్ హీరోయిన్ కి ఓకే చెప్పడం వంటివి చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో తరువాతి సినిమాలు పరశురామ్ అనే మరో యంగ్ డైరెక్టర్ కు అప్పగించాడు. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కథను కూడా ఫైనల్ చేయడానికి రెడీ అవుతున్నాడట.
అంతేకాదు పెద్దగా ఆర్భాటాలు వద్దు అని కూడా మహేష్ చెబుతున్నాడట. మీడియం రేంజ్ హీరోయిన్ చాలు, సాధ్యమైనంత త్వరగా సినిమా కంప్లీట్ చెయ్యాలి. బడ్జెట్ విషయంలో తేడాలు రాకుండా .. ప్రీ ప్రొడక్షన్ పనులు జాగ్రత్తగా చూడండి అని మహేష్ సూచిస్తున్నాడట. ముఖ్యంగా మీ దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే .. కథ తీసుకు రండి అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడట. నిర్మాతల దగ్గర నుండీ ఒక్క అడ్వాన్స్ మినహాయిస్తే.. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాకే బ్యాలెన్స్ పేమెంట్ చెయ్యమని చెబుతున్నాడట. కావాలంటే నాన్ థియేట్రికల్ రైట్స్ లో షేర్ తీసుకుంటాను అని చెబుతున్నాడట. అన్నిటి కంటే ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేసే ఆలోచన మహేష్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు