Mahesh Babu: కొత్త మహేష్ ను చూస్తున్నామంటున్న ఫ్యాన్స్.. కానీ?

స్టార్ హీరో మహేష్ బాబుకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో మహేష్ బాబుకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుండగా ప్రస్తుతం ఈ స్టార్ హీరో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది మే నెల 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Click Here To Watch

అయితే గతంతో పోలిస్తే మహేష్ బాబు చాలా మారారని మహేష్ బాబు అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా టాక్ షోలలో, గేమ్ షోలలో పాల్గొనటానికి మహేష్ బాబు అస్సలు ఇష్టపడరు. అయితే మహేష్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో పాటు అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని సందడి చేయడం గమనార్హం. మరోవైపు తాజాగా జగన్ తో జరిగిన సమావేశానికి మహేష్ హాజరయ్యారు. మహేష్ తండ్రి కృష్ణ ఒకప్పుడు కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండేవారు.

తర్వాత కాలంలో కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు. మహేష్ బావ గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నా ఆ పార్టీ తరపున మహేష్ ఎప్పుడూ ప్రచారం చేయలేదనే సంగతి తెలిసిందే. మహేష్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీడియాతో కూడా మాట్లాడారు. మహేష్ బాబులో వచ్చిన ఈ మార్పును చూసి ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉండటంతో పాటు బుల్లితెరపై, ఓటీటీలలో సందడి చేస్తుండటం అభిమానులను ఆనందాన్ని కలిగిస్తోంది.

సర్కారు వారి పాటతో మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలతో పాటు మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus