Mahesh Babu,Allu Arjun: మహేష్‌ సినిమా లేట్‌… బన్నీ సినిమా నెంబరు మారుతుందా?

మహేష్‌ బాబు సినిమా లేట్‌ అయితే… బన్నీ సినిమా డౌటా? అదెలా? అంత లింక్‌ ఏముంది అనుకుంటున్నారా? అయితే బన్నీ ప్రజెంట్‌ సినిమా కాదు, ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి. ఇదేం చిక్కు అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి మీకే మొత్తం క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం మహేష్‌బాబు చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకుడు అనే విషయం తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా దర్శకుడు కూడా ఆయనే.

ఇప్పుడు అర్థమైందా మేం చెప్పబోతున్న విషయం ఏంటో… బన్నీ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో మొదలై, ఎప్పుడో పూర్తయి, ఇప్పటికి సినిమా విడుదలైపోవాల్సి ఉన్నా… వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌లో సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సమ్మర్‌ నాటికి (Allu Arjun) బన్నీని ‘పుష్ప’రాజ్‌ గెటప్‌ నుండి బయటకు తీసుకొచ్చేసే దిశగా షూటింగ్‌ చేస్తున్నారట.

అయితే, ఆ సమయానికి త్రివిక్రమ్‌ పూర్తి కథతో సిద్ధంగా ఉంటే… కొత్త సినిమాను కాస్త గ్యాప్‌ తీసుకొని చేసేద్దాం అని బన్నీ అనుకున్నాడట. అందుకు తగ్గట్టుగా ఇటీవల ఆ సినిమాను కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు చూస్తుంటే బన్నీ ఖాళీ అయినా త్రివిక్రమ్‌ ఆ టైమ్‌కు సినిమా కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పరిస్థితి ఉండదు అంటున్నారు. ‘గుంటూరు కారం’ సంక్రాంతికి వచ్చినా.. కొత్త కథ మీద ఆయన దృష్టి పెట్టడానికి ఓ ఆరేడు నెలల సమయం అయినా తీసుకుంటారు.

కాబట్టి ఏ జూన్‌, జులైలో సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు షురూ చేస్తారు. కాబట్టి 2024 ఆఖరులో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లొచ్చు అంటున్నారు. దీంతో త్రివిక్రమ్‌ సినిమా కంటే ముందే బన్నీ మరో దర్శకుడితో సినిమా చేయొచ్చు అనే టాక్‌ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే అంత త్వరగా ఓకే అయ్యి, సినిమాను పూర్తి చేసే దర్శకుడు ఎవరు అనేదే లేటెస్ట్‌ ప్రశ్న. చూద్దాం మరి ఎవరు ముందుకొస్తారో? అసలు బన్నీ ఎప్పుడు ఖాళీ అవుతాడో?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus