Mahesh Babu: అఖిల్ చేసిన స్టంట్ పై మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ అయిపొయింది, విడుదలకి సిద్ధంగా వుంది. ప్రేక్షకులని సినిమా థియేటర్స్ కి తీసుకురావటానికి అఖిల్ తనవంతు కృషి తాను చేస్తూ మళ్ళీ కష్టపడుతున్నాడు. అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ అనే సినిమాతో ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి అఖిల్ ఎంత కష్టపడ్డాడు అనేది అతని మాటల్లోనే తెలిసిపోతోంది. సినిమా షూటింగ్ వివిధ కారణాల వాళ్ళ డిలే అయినా కూడా అదే బాడీ ఫిజిక్ ని మెన్ టైన్ చేస్తూ, అలాగే ఆహార నియమాలు పాటిస్తూ అఖిల్ చాలా సహనంగా ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నాడు.

హిందీలో విడుదల చెయ్యకూడదు అని చివరి నిముషంలో తీసుకున్న నిర్ణయం కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని ముందుకు వెళుతున్నాడు. అలాగే కొన్ని రోజుల క్రితం విజయవాడ లో జరిగిన ఈ సినిమా ప్రచార ఈవెంట్ లో అఖిల్ చాలా ఎత్తెయిన మల్టీప్లెక్స్ పైనుండి కిందకి దూకి ట్రైలర్ గురించి చెప్పాడు. అంటే అఖిల్ ఈ సినిమా విడుదలకి ముందు ప్రేక్షకులని సినిమా థియేటర్స్ కి రప్పించడానికి, సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేస్తున్నాడు.

దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడు అయితే, అనిల్ సుంకర నిర్మాత. ఇప్పుడు పరిశ్రమలోని చాలామంది మహేష్ బాబు (Mahesh Babu) తో సహా ఇతర నటులు అందరూ ఈ ట్రైలర్ చూసి అఖిల్ ని ప్రశంసిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ చూసి అఖిల్ ట్రాన్సఫార్మేషన్ చాల బాగుంది అని చెపుతున్నాడు. అలాగే అనిల్ సుంకర ని కూడా ప్రశంశలతో ముంచెత్తాడు. చాలామంది యువనటులు అడివి శేష్, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు ట్వీట్ చెయ్యగా, చాలామంది పరిశ్రమలోని వాళ్ళు అఖిల్ ని ప్రశంసిస్తున్నారు.

గత కొన్ని రోజులనుండి అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ప్రచారం లోనే పాల్గొంటున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని పట్టణాలు తిరుగుతూ, ఈ వారం తెలంగాణలోని పట్టణాలు కూడా చుట్టేస్తాడని అంటున్నారు. 28 ప్రీ-రిలీజ్ వేడుక కూడా వరంగల్ లో ఉంటుందని అంటున్నారు. ఒక పెద్ద స్టార్ ఈ వేడుకకు ముఖ్య అతిధి గా వస్తాడని కూడా చెపుతున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయకురాలు కాగా, మమ్మూట్టి, డినో మోరీ లు ప్రధాన పాత్రల్లో కనపడతారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus