Sitara: సితారకు ఇష్టమైన రెండు పనులు ఇవే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు ఇప్పటివరకు సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఈ చిన్నారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. నమ్రత సితార యొక్క ఫోటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. సితార క్యూట్ గా మాట్లాడే మాటలకు సంబంధించిన వీడియోలతో పాటు సితార డ్యాన్స్ లు, అల్లరి చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సితారకు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఉండగా సితార వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి కొన్ని వీడియోలు చేశారు. సితార, ఆద్య కలిసి చేసిన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కూల్ కు సెలవులు ఇచ్చిన సమయంలో సితార సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు. జూన్ నెల రావడంతో సితారకు ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. మళ్లీ సితార చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

తాజాగా సితార సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి తనకు ఉదయం సమయంలో ఎండలో రెండు పనులు చేయడం ఇష్టమని వెల్లడించారు. ఆ పనులలో ఒకటి చదవడం కాగా మరొకటి ఫోటోలు దిగడమని సితార చెప్పుకొచ్చారు. సితార ఎండలో చదువుకుంటున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పుస్తకాలతో కుస్తీ పడుతున్న సితార భవిష్యత్తులో ఏమవుతారో చూడాల్సి ఉంది. సితార సినిమాల్లోకి బాలనటిగా ఎంట్రీ ఇవ్వాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటుండగా మహేష్ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus