Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

టాలీవుడ్‌లో మహేష్‌బాబు – అల్లు అర్జున్‌ పోటీపడుతున్నారు. ఎవరికి వారు సినిమాలు చేస్తూనే, విజయాలు సాధిస్తూనే స్టార్లుగా దూసుకెళ్తున్నారు. అయితే ఇది నటనలోనే కాదు.. సినిమా బిజినెస్‌లో కూడా పోటాపోటీగా వెళ్తున్నారు. ఏఎంబీ సినిమాస్‌ అంటూ మహేష్‌బాబు ఓవైపు స్క్రీనింగ్‌ బిజినెస్‌ చేస్తుండగా.. అల్లు సినిమాస్‌ అంటూ అల్లు అర్జున్‌ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ విషయంలో అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు పై చేయి సాధించాడు.

Mahesh Babu

సినిమా స్క్రీనింగ్‌ రంగంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న పెద్ద చర్చ ‘డాల్బీ’. ఈ విషయంలో మహేష్‌ బాబు సినిమా అభిమానులకు శుభవార్త చెప్పారు. బెంగళూరులో కొత్తగా నిర్మించిన ‘ఏఎంబీ సినిమాస్‌’ ద్వారా ‘డాల్బీ’ అనుభూతిని అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16న స్క్రీన్‌ ప్రారంభమవుతుంది అని అనౌన్స్‌ చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో మహేష్‌ రాసుకొచ్చారు. డాల్బీ కోసం ‘ఏఎంబీ సినిమాస్‌’ టీమ్‌ ఎంతో కష్టపడిందని చెబుతూ.. బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

దక్షిణాదిలో ఇదే తొలి డాల్బీ తెర అని చెప్పొచ్చు. 60 అడుగులు ఉన్న తెర కంటే ముందు పుణెలో డాల్బీ స్క్రీన్‌ (55 అడుగులు) పెద్దది. ఇప్పుడు బెంగళూరు డాల్బీ రికార్డును ఏఎంబీ బ్రేక్‌ చేస్తుంది. అయితే ఈ రికార్డును అల్లు అర్జున్‌ బ్రేక్‌ చేస్తారు అని అంటున్నారు. హైదరాబాద్‌లో త్వరలో స్టార్ట్‌ కానున్న ‘అల్లు సినిమాస్‌’లో డాల్బీ సినిమా ఉంటుంది. దేశంలోనే అత్యంత పెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా నిలవనుంది. నిజానికి ఈ మల్టీప్లెక్స్‌ ఇప్పటికే స్టార్ట్‌ అవ్వాల్సింది.

కోకాపేట ప్రాంతంలో భారీ హంగులు, సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్‌ని సిద్ధం చేస్తున్నారు. ‘ఏఎంబీ’ సినిమాతో పోటీ పడితే హంగులు, సౌకర్యాల విషయంలో అల్లు సినిమాస్‌ భారీ స్థాయిలో ఉంటుందని ఇప్పటివరకు బయటకు వచ్చిన వీడియోలు చూస్తే అర్థమవుతోంది. చూద్దాం మరి ఏ స్క్రీన్లు బాగున్నాయో. బెంగళూరు ఏఎంబీ లాంచ్‌ అయ్యాక ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus