Mahesh Babu: కృష్ణ పెద్దకర్మ తండ్రిని తలుచుకుని కన్నీరు పెట్టిన మహేష్ బాబు?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే నవంబర్ 15న అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ ఇటీవల మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణ తెలుగులో దాదాపుగా 350కు పైగా సినిమాలు లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఇండస్ట్రీని ముందుకు నడిపించారు కృష్ణ.

అటువంటి సూపర్ స్టార్ కృష్ణని కోల్పోవడం అన్నది నిజంగా దురదృష్టకరమని చెప్పవచ్చు. అయితే అప్పటికే సోదరుడు, తల్లి చనిపోయి బోలెడు దుఃఖంలో ఉన్న మహేష్ బాబు ఆ బాధల నుంచి అప్పుడప్పుడే తేరుకుంటుండగా కొండంత అండగా ఉన్న తన తండ్రి కూడా మరణించడంతో ఒక్కసారిగా దిగ్బాంతికి లోనయ్యాడు. మహేష్ బాబు తన మనసుని గట్టి చేసుకుని తన బాధని దిగమింగుకొని తన తండ్రికి అంత్యక్రియలను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ ఈ కార్యక్రమం జరిగింది. కృష్ణ పెద్దకర్మ కార్యక్రమము హైదరాబాదులోని జేఆర్సీ, ఎన్‌ కన్వెన్షన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటుగా వేలాదిమంది అభిమానులు హాజరయ్యారు. అయితే తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న మహేష్ బాబు బాధతోనే అలాగే పెద్ద కర్మకు సంబంధించిన పనులు అన్నీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మహేష్ బాబు మాట్లాడుతూ..

నాన్న నాకు ఎన్నో ఇచ్చారు.. వాటిలో గొప్పది మీ అభిమానం.. దానికి ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడు నా గుండెల్లో మీ గుండెల్లో ఉంటారు. అయినా ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పటికీ ఆయన ఎప్పుడు మన మధ్య ఉంటారు. అలాగే మీ అభిమానం ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ మహేష్ బాబు కన్నీరు పెట్టుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులతోపాటు ఎంతోమంది అభిమానులు హాజరయ్యారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus