Mahesh Babu: మంచి మనసుకు నిదర్శనం ఇదే కదా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9వ తేదీ కావడంతో అభిమానులు ఇప్పటినుంచి ఈయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా అభిమాన హీరోలు పుట్టినరోజు వేడుకలు అయితే పెద్ద ఎత్తున అభిమానులు పాలాభిషేకాలు చేయడం కేక్ కట్ చేయడం అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీ ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను చేయడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అదేవిధంగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమాని తిరిగి ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలుపుతూ అధికారకంగా పోస్టర్ వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా క్షణాల్లో థియేటర్ లు హౌస్ ఫుల్ కావడం విశేషం. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

పోకిరి సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లను నిర్వాహకులు మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళంగా ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా ఈయన సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఒక మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మహేష్ బాబు ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

అదేవిధంగా తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లను నిర్వహించి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఈ విధంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేయడంతో పోకిరి సినిమా వసూలను కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇలాఈ సినిమా వసూళ్లన్ని విరాళంగా ప్రకటించడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus